»   »  మెగా వార్ తప్పదా?: బన్నీ వెర్సస్ పవన్

మెగా వార్ తప్పదా?: బన్నీ వెర్సస్ పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి వార్...అయ్యిపోయింది. ఇప్పుడు సమ్మర్ వార్ కు రంగం సిద్దమవుతోంది. సంక్రాంతికి బాబాయ్, అబ్బాయి మధ్య క్లాష్ భాక్సాఫీస్ వద్ద క్లాష్ వచ్చింది. నందమూరి అభిమానులు ఎవరికి ఓటు వేయాలి అనే డైలమోలో పడిపోయారు. ఇప్పుడు అలాంటి సిట్యువేషనే...సమ్మర్ కూడా రానుంది. పవన్ కళ్యాణ్..సర్దార్ గబ్బర్ సింగ్, బన్ని..సరైనోడు చిత్రాలు రెండు భాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం ఒకే నెలలో ఇంకా చెప్పాలంటే ఒకే రోజు రెండూ రిలీజ్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. మీరు చదువుతున్నది నిజమే..ఏప్రియల్ 8 న ఈ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాసం ఉంది.

Allu Arjun to clash with Pawan Kalyan!!

ఈరోస్ వారు ..సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ ని ఏప్రియల్ 8 న విడుదల అని ఖరారు చేసారు. మరో ప్రక్క సరైనోడు టీమ్ తమ చిత్రం ...ఏప్రియల్ 8 న రిలీజ్ అవుతుందని ఈ రోజు ప్రకటించేసారు. అనుకున్నది అనుకున్నట్లుగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు వస్తే మెగా వార్ స్టార్టైనట్లే అంటున్నారు.

ఇక ఈ రెండు చిత్రాలకు భాక్సాఫీస్ వద్ద మంచి క్రేజే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి ఇప్పటికే ఓ రేంజిలో బిజినెస్ జరుగుతోంది. సరైనోడు చిత్రం గురించి అయితే చెప్పక్కర్లేదు. సత్యమూర్తి లో సాఫ్ట్ రోల్ చేసిన బన్నీ ఈ సినిమాలో యాక్షన్ తో అదరకొట్టనున్నాడు.

English summary
Pawan Kalyan starer Sardaar Gabbar Singh and Allu Arjun’s Sarrainodu will be releasing in the same month on the same day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu