»   » ‘ఇద్దరమ్మాయిలతో’ మొదటి రోజు కలెక్షన్స్ (అఫీషియల్)

‘ఇద్దరమ్మాయిలతో’ మొదటి రోజు కలెక్షన్స్ (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం మొన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా రూపొందించారు. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ గురించి అల్లు శిరీష్ ట్వీట్ చేసారు. అఫీషియల్ గా ఆ లెక్కలు వివరించారు.

'ఇద్దరమ్మాయిలతో' మొదటి రోజు ఆలిండియా కలెక్షన్స్ గ్రాస్: 12cr +.

కేవలం ఆంధ్రప్రదశ్: 10.5 కోట్లు,
కర్ణాటక: 1.05cr.
నెట్ : 9 కోట్లు
షేర్: 7.05 కోట్లు (నైజాం - 227 లక్షలు/ సీడెడ్ - 143 లక్షలు/ ఆంధ్ర - 335 లక్షలు).
ఇంకా తమిళ, కేరళ ఫిగర్స్ రావాల్సి ఉంది.

ఇది బన్ని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపినింగ్ అని, పూరీ జగన్నాధ్ కి అంతటి విజయం అందించినందుకు కంగ్రాట్స్ అని,నిర్మాతకు, మిగతా స్టాఫ్ కు,సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ చిత్రాన్ని బన్నీ-పూరి కాంబినేషన్లో వచ్చిన మంచి స్టైలిష్ ఎంటర్టెనర్‌గా చెప్పుకోవచ్చు. బన్నీ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనపడటంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇక డాన్సులు ఇరగ దీసాడనే చెప్పాలి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని 'పాప రీట' సాంగుకు చిరంజీవి మాదిరి స్టెప్పులేసి దుమ్ము రేపాడు. కేచ కంపోజ్ చేసిన యాక్షన్స్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి.

English summary
"Iddarammayilatho day-1 all India gross: 12cr +. AP - 10.5cr, Karnataka 1.05cr. Waiting for TN & Kerala figures. Iddarammayilatho Day-1 AP: GROSS 10.5cr, NETT 9cr, SHARE 7.05 cr (Nizam - 227L/Ceeded - 143L/Andhra - 335L). Bunny's biggest opening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu