»   » పవన్ పై గౌరవంతోనే ... బన్నీ వెనక్కి తగ్గాడు

పవన్ పై గౌరవంతోనే ... బన్నీ వెనక్కి తగ్గాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో ఫిల్మ్ సర్కిల్స్లో ఎక్కువ చర్చగా మారిన అంశం...భాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్, బన్నీ ఒకే రోజు పోటి పడబోతున్నారని. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం, అల్లు అర్జున్ ..సరైనోడు చిత్రం ..రెండూ ఏప్రియల్ 8న విడుదల తేదీలు ఫిక్స్ చేయటంతో ఈ టాపిక్ వచ్చింది.

అయితే అందుతున్న సమాచారం..అల్లు అర్జున్ వెనక్కి తగ్గాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రియల్ 8న అని విడుదల తేదీ ఫిక్సైనా..ఇప్పుడు దాన్ని మార్చాడని ట్రేడ్ వర్గాల సమచారం.

Allu Arjun's Sarrainodu to release on April 22

పవన్ కళ్యాణ్ పై గౌరవంతో అల్లు అర్జున్ డెశిషన్ మార్చుకున్నట్లు సమాచారం. సరైనోడు రిలీజ్ డేట్ మార్చమని తన నిర్మాతకు చెప్పాడని, ఇప్పుడు ఆ తేదీని ఏప్రియల్ 22కు మార్చారని వినపడుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే ఇంకా ఏమీలేదు.

మరో ప్రక్క డిస్ట్రిబ్యూటర్స్ సైతం పెద్ద సినిమాలు రెండు రిలీజ్ అవుతున్నప్పుడు మినిమం రెండు వారాలు గ్యాప్ లేకపోతే ఎలా అన్న విషయమై నిర్మాతలను నిలదీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బన్నీ ఈ నిర్ణయం తీసుకుని అనవసరమైన వివాదాలకు తావు ఇవ్వలేదని తెలుస్తోంది.

English summary
Allu Arjun always gives respect to Pawan Kalyan and he never competes with him. So he decided to release Sarrainodu on April 22.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu