Annaatthe movie 7th day collections మరో మైలురాయి దిశగా రజనీ మూవీ.. తొలి భారతీయ చిత్రంగా రికార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అన్నాతే మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వరద పారుతున్నాయి. హాలీడేనా? వర్కింగ్ డేనా? అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మోత మోగిస్తున్నది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ తమిళనాడు, ఓవర్సీస్‌లోను భారీ వసూళ్లను రాబడుతున్నది. 6 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లతోపాటు 7వ రోజు కలెక్షన్ల అంచనాల ఎలా ఉన్నాయంటే..

భారీ వరదలను ఎదురించిన అన్నాతే
లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో భారీగా విడుదలైన అన్నాతే చిత్రం వారాంతం వరకు కనివినీ ఎరుగని కలెక్షన్లను సాధించింది. కలెక్షన్ల జోరు కొనసాగుతుండగా తమిళనాడు భారీ వర్షాలు ముంచెత్తాయి. అయినా అన్నాతే కలెక్షన్లు తగ్గుముఖం పట్టకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఆరు రోజుల్లో 120 కోట్లకుపైగా
తమిళనాడులో గత ఆరు రోజుల అన్నాతే కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజున ఈ చిత్రం రికార్డు స్థాయిలో 34.92 కోట్లు, రెండో రోజున 27.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 21.30 కోట్లు, నాలుగో రోజున 17.86 కోట్లు, ఐదో రోజున రూ.7.41 కోట్లు, ఆరో రోజున రూ.6.23 కోట్లు రాబట్టింది. దాంతో తమిళనాడులో రూ.120 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా కలెక్షన్లు
ఇక పలు ప్రాంతాల్లో రికార్డులు తిరగరాస్తున్న అన్నాతే చిత్రం.. తెలుగులో మాత్రం రెండు రోజులకే చేతులు ఎత్తేసింది. పెద్దన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఐదు రోజుల్లో తెలుగు రాష్టాల్లొ రూ.3.5 కోట్లు నెట్, 6.20 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆరో రోజున మరో 35 లక్షలు వసూలు చేసింది. దాంతో ఏపీ, నైజాంలో రూ.6.55 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో
అన్నాతే చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ ముందుకెళ్తున్నది. లాక్‌డౌన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా రికార్డు నెలకొల్పింది. తొలి రోజున 70.19 కోట్లు, రెండో రోజున రూ.42.63 కోట్లు, మూడో రోజున 33.71 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 28.20 కోట్లు, ఐదో రోజున 11.85 కోట్లు, ఆరో రోజున 9.50 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 196.08 కలెక్ట్ చేసింది.
Recommended Video

200 కోట్ల మైలురాయికి చేరువగా
ఇక ఏడో రోజున అన్నాతే చిత్రం మోస్టారు కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏడో రోజున తమిళనాడులో రూ.5 కోట్లకుపైగా వసూలు చేయవచ్చని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షలకుపైగా రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంచనాల ప్రకారం.. ఏడో రోజు సుమారు రూ.6 కోట్లకుపైగానే వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











