»   » సూపర్‌స్టార్లకు ధీటుగా భాగమతి కలెక్షన్లు.. శ్రీదేవి రికార్డుపై లేడీ సూపర్‌స్టార్ అనుష్క గురి..

సూపర్‌స్టార్లకు ధీటుగా భాగమతి కలెక్షన్లు.. శ్రీదేవి రికార్డుపై లేడీ సూపర్‌స్టార్ అనుష్క గురి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రం తర్వాత అనుష్క నటించిన భాగమతి సినిమా కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. భాగమతి చిత్రం రిలీజై 10 రోజులు దాటిన కలెక్షన్ల తుఫాన్‌ తగ్గడం లేదు. సూపర్‌స్టార్లకు ధీటుగా అనుష్క సినిమా కలెక్షన్లు సాధించడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా సాధిస్తున్న వసూళ్ల వివరాలు ఇవిగో..

భాగమతి కలెక్షన్లు చూసి పరేషాన్, హీరోలకు ఏమాత్రం తీసిపోలేదు
 తెలుగు రాష్టాల్లో భారీ కలెక్షన్లు

తెలుగు రాష్టాల్లో భారీ కలెక్షన్లు

తెలుగు రాష్టాల్లో భాగమతి చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. నైజాం, ఏపీలో కలిపి రూ.17.95 కోట్లు (గ్రాస్ 28.5 కోట్లు) సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల గ్రాస్ (30.9 కోట్లు నికర) వసూళ్లను భాగమతి సాధించింది.

 నైజాంలో దూసుకెళ్తున్న భాగమతి

నైజాంలో దూసుకెళ్తున్న భాగమతి

నైజాంలో ఈ చిత్రం రూ.7.05 కోట్ల నికరం (గ్రాస్ 11.5 కోట్లు) సాధించింది. సీడెడ్‌లో రూ.2.60 కోట్ల నికర వసూళ్లను సొంతం చేసుకొన్నది. ఇంకా కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా మంచి వసూళ్లను సాధిస్తున్నది.

ఏపీలోనూ దుమ్మురేపుతున్న అనుష్క

ఏపీలోనూ దుమ్మురేపుతున్న అనుష్క

ఇక ఏపీలోని వైజాగ్‌లో 2.33 కోట్లు, తూర్పు గోదావరిలో 1.48 కోట్లు, పశ్చిమ 1.01, కృష్ణా 1.28 కోట్లు, గుంటూరులో 1.40 కోట్లు, నెల్లూరు రూ.0.80 కోట్లతో 8.30 కోట్లు నికరం (13.2 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.

తమిళ, కేరళలో కూడా రికార్డు కలెక్షన్లు

తమిళ, కేరళలో కూడా రికార్డు కలెక్షన్లు

తెలుగేతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా భాగమతి మంచి వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 2.55 కోట్లు, తమిళనాడు 4.05 కోట్లు, కేరళలో 83 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో రూ.80 లక్షలు వసూలు చేసింది.

యూఎస్‌లో మిలియన్ డాలర్లు

యూఎస్‌లో మిలియన్ డాలర్లు

భాగమతి చిత్రం ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్నది. సూపర్‌స్టార్లకు ధీటుగా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించింది. హీరోయిన్లలో శ్రీదేవి తర్వాత మిలియన్ మార్క్ కలెక్షన్లను సాధించిన హీరోయిన్‌గా అనుష్క రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం రూ.6 కోట్లకుపైగా సాధించడం ట్రేడ్ అనలిస్టులను షాక్ గురిచేస్తున్నది.

శ్రీదేవి రికార్డుపై అనుష్కశెట్టి గురి

శ్రీదేవి రికార్డుపై అనుష్కశెట్టి గురి

2012లో శ్రీదేవి కమ్‌బ్యాక్ మూవీ ఇంగ్లీష్ వింగ్లీష్ అమెరికాలో 1.85 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియన్ హీరోయిన్లలో శ్రీదేవిదే ఆ రికార్డు. ఇప్పుడు భాగమతి చిత్రంతో శ్రీదేవి రికార్డును తిరగరాసేందుకు అనుష్క దూసుకెళ్లున్నది.

English summary
Anushka Shetty‘s Bhaagamathie hit theatres but there’s no stopping it. Reports suggest the film has grossed Rs 50 crore at the worldwide box office, but the real win is at the US Box office! Trade analyst Ramesh bala tweeted that Anushka Shetty rightly earns the title of the lady superstar, courtesy Bhaagamathie’s record-breaking success Bhaagamthie is all set to be Anushka Shetty's biggest hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu