Just In
- 21 min ago
ఓడినప్పుడు నన్ను చూసి నవ్వారు.. ఊపిరాడనివ్వకుండా చేశారు: సింగర్ సునీత
- 1 hr ago
నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్
- 1 hr ago
RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!
- 10 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
Don't Miss!
- News
సింగర్ సిద్ శ్రీరామ్‌కు అవమానం... పబ్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు... నీళ్లు,మద్యం విసిరేసి...
- Sports
ISL 2020-21: గోవా ‘షూట్ ఔట్’.. టైటిల్ ఫైట్‌కు ముంబై సిటీ
- Finance
వచ్చే ఆర్థిక సంవత్సరం బ్యాంకుల పరిస్థితి దిగజారొచ్చు, కారణమిదే
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Aswathama collections : అదరగొట్టిన అశ్వథ్థామ.. ఆరు రోజుల్లోనే లాభాల్లోకి
యంగ్ హీరో నాగశౌర్య అశ్వథ్థామ అంటూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సొంతంగా కథ రాసుకుని, సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించిన అశ్వథ్థామ మంచి విజయాన్ని అందుకుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో తెరకెక్కించిన ఈ సినిమా.. వారం తిరక్కుండానే లాభాల బాట పట్టేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు ఓ అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఆరు రోజుల్లో అశ్వథ్థామ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిజనబుల్ రేటుకే అమ్మినట్టు తెలుస్తోంది. అందుకే అన్ని ఏరియాల్లో ఇప్పటికే లాభాల బాట పట్టినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 5కోట్లు, రెస్టాఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 1.5కోట్లు ఇలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 6.5కోట్లకు అశ్వథ్థామ అమ్మినట్టు సమాచారం.

మొదటి రోజు నుంచే దూకుడు..
నాగ శౌర్య లుక్స్, గెటప్ కొత్తగా ఉండటం.. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై ఆసక్తిని పెంచడంతో అశ్వథ్థామపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ మూవీకి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. ఈ మూవీ మొదటి రోజు దాదాపు నాలుగు కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

ఆరో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
అశ్వథ్థామ సినిమా ఆరో రోజు ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం. ఈ సినిమా నైజాంలో 7లక్షలు, సీడెడ్‌లో లక్ష, ఉత్తరాంధ్రలో మూడు లక్షలు, ఈస్ట్‌లో 1.7లక్షలు, వెస్ట్‌లో 1.4లక్షలు, గుంటూరులో 2లక్షలు, కృష్ణాలో 2.1లక్షలు, నెల్లూరులో లక్ష ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై లక్షలు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

ఐదో రోజు బ్రేక్ ఈవెన్.. ఆరో రోజు లాభాల పంట
అశ్వథ్థామ ఐదో రోజు బ్రేక్ ఈవెన్ సాధించినట్టు పేర్కొన్న చిత్రయూనిట్.. ఆరో రోజు లాభాల దారిన పడిందని తెలిపారు. విడుదల చేసిన అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చేసిందని ప్రకటించారు. ఈ మూవీ ఆరో రోజుల్లో 15.30కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.