»   » ‘అత్తారింటికి దారేది’ 6 వీక్స్ కలెక్షన్ ఎంత?

‘అత్తారింటికి దారేది’ 6 వీక్స్ కలెక్షన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ 6 వారాలు పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సినిమా టోటల్ షేర్ రూ. 80 కోట్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈచిత్రం 50 రోజుల వేడుక జరుపుకోబోతోంది.

సినిమా ఇప్పటికే నైజా, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకుని ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులు సృష్టించబోతోంది. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సినిమాలో అదపు సీన్లు కలపడం కూడా సినిమాకు ప్లస్సయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
'Atharintiki Daredi' movie successfully crossed the overall share of Rs.80 crores at the end of its six weeks run.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu