Don't Miss!
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Finance
Zomato: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
- News
vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
అవెంజర్స్‌కు ఎదురెవ్వడు.. 400 కోట్లతో బాక్సాఫీస్ కుమ్ముడు
అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా కలెక్షన్ల స్పీడ్‌కు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ పడేటట్టు కనిపించడం లేదు. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం గత 14 రోజుల్లో రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, రూ.338 కోట్ల నికర వసూళ్లను కుమ్మేసింది. తొలి మూడు రోజుల్లో రూ.100 కోట్లు దాటేసిన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు కొల్లగొట్టింది.
ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలను ఎదిరిస్తూ రూ.300 కోట్లు, అనంతరం రూ.350 కోట్లు వసూలు చేసింది. తాజాగా రూ.400 క్లబ్‌లో చేరింది. ఇక నికరంగా రూ.400 కోట్ల రికార్డును మరో కొన్ని రోజుల్లో అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తొలివారంలో రూ.260 కోట్లు, రెండో వారంలో రూ.78 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద నికరంగా రూ.338 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
అవెంజర్స్ వసూళ్ల వరద.. టైటానిక్ రికార్డు బ్రేక్.. 11 రోజుల్లోనే టాప్ రికార్డులు గల్లంతు!
అంతర్జాతీయంగా కూడా ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇప్పటికే టైటానిక్ వసూళ్ల రికార్డును బ్రేక్ చేసింది. అవతార్‌ను అధిగమించేందుకు అవెంజర్స్ చిత్రం ప్రయత్నిస్తున్నది.

ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించారు. మార్వెల్ సీక్వెల్‌లో చిట్టచివరిది 22వ చిత్రంగా భావిస్తున్న ప్రేక్షకుడికి పంచభక్ష పరమాన్నంలా అన్నింటిని అందించింది అని వెల్లడించింది. ఈ సినిమాకు సినీ రేటింగ్ వెబ్‌సైట్ రాటెన్ టామోటోస్ 96 శాతం స్కోరింగ్ ఇవ్వడం విశేషం.