»   » బాహుబలి సునామీ: అల్లాడుతున్న బాలీవుడ్ సినిమాలు.. వర్మకు రాజమౌళి షాక్..

బాహుబలి సునామీ: అల్లాడుతున్న బాలీవుడ్ సినిమాలు.. వర్మకు రాజమౌళి షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి2 సినిమా విడుదలై 15 రోజులు దాటినా కలెక్షన్ల సునామీ తగ్గుముఖం పట్టడం లేదు. వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన బాహుబలి2 చిత్రం తాజాగా రూ.1250 కోట్ల వసూళ్లను సాధించింది. బాహుబలి సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్‌లో మేరి ప్యారీ బిందు, సర్కార్3 చిత్రాలు విడుదలయ్యాయి. అయితే బాహుబలి కలెక్షన్ల ముందు వాటి వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయనే విషయాన్ని ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు.

   400 కోట్ల క్లబ్‌లో..

  400 కోట్ల క్లబ్‌లో..

  భారత సినీ చరిత్ర రికార్డులను తిరగరాస్తున్న బాహుబలి2 సినిమా ప్రస్తుతం రూ.1250 కలెక్షన్లతో ముందంజలో ఉంది. గతంలో అమీర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటివరకు హిందీ వెర్షన్ బాహుబలి తాజాగా రూ.400 కోట్లు వసూళు చేసింది. దేశీయంగా రూ.400 కోట్ల క్లబ్‌‌లో చేరిన తొలిచిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించనున్నది. తొలివారంలో రూ.247 కోట్లు వసూలు చేయగా, రెండోవారంలో రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్టు సమాచారం.

  రెండో వారం వసూళ్లు ఇలా..

  రెండో వారం వసూళ్లు ఇలా..

  గతవారం వసూళ్లను పరిశీలిస్తే శుక్రవారం 19.75 కోట్లు, శనివారం 26.50 కోట్లు, ఆదివారం రూ.34.50 కోట్లు, సోమవారం రూ.16.75 కోట్లు, మంగళవారం రూ.15.75 కోట్లు, బుధవారం రూ.17.25 కోట్లు, గురువారం రూ.12.75 కోట్లుతో మొత్తం రూ.390.25 కోట్లు వసూళు చేసింది.

  మూడోవారం కూడా జోరు..

  మూడోవారం కూడా జోరు..

  బాలీవుడ్‌లో ఎంతటి సూపర్‌స్టార్ సినిమా అయినా కలెక్షన్ల వరద రెండువారాల కంటే ఎక్కువగా ఉండదు. బాహుబలి2 పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కనిపిస్తున్నది. ప్రతీ రోజు, ప్రతీవారం ఏదో ఒక మైలురాయిని అధిగమిస్తున్నది. బాహుబలి జోరు చూస్తే ఇప్పట్లో కలెక్షన్ల హోరు ఏమాత్రం తగ్గే అవకాశం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నదని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

   థియేటర్లు దొరకని పరిస్థితి..

  థియేటర్లు దొరకని పరిస్థితి..

  ఇదిలా ఉండగా, ఇప్పటివరకు బాలీవుడ్‌లో అమితాబ్, వర్మకు తిరుగులేదు. వర్మ, బిగ్‌బీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే పిచ్చిగా ఎదురుచూసేవారు. కానీ పరిస్థితి మారింది. తాజా పరిస్థితి ఏమింటంటే సర్కార్ సినిమాను విడుదల చేయడానికి థియేటర్లు దొరకలేదట. దాదాపు 4000 థియేటర్ల విడుదల చేయాలని ప్లాన్ చేస్తే కేవలం 1425 థియేటర్లు చాలా కష్టంగా లభించాయని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

  వర్మకు ఈ విధంగా షాక్..

  వర్మకు ఈ విధంగా షాక్..

  సర్కార్‌3 సినిమా విడుదలకు థియేటర్లు దొరకకపోవడానికి కారణం బాహుబలి2 సినిమా. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు గడిచినా థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. మూడోవారంలో థియేటర్ల నుంచి బాహుబలిని తీసేసే పరిస్థితి లేదు. దాంతో సర్కార్3కి థియేటర్లు దొరకడం కష్టంగా మారిందని తాజా సమాచారం. గత కొద్దికాలంగా హిట్లు లేక అల్లాడుతున్న వర్మకు రాజమౌళి ఈ విధంగా షాకిచ్చాడని పలువురు గుసగుసలాడుకొంటున్నారు.

  English summary
  Baahubali 2 box office collection day 15: SS Rajamouli's fantasy epic is in no mood to slow down. The film has done a staggering business in two weeks and collected Rs 1250 crore so far. Meri Pyaari Bindu and Sarkar 3 have been released on 750 and 1425 screens respectively. That’s dramatically less compared to 6500 screens on which Baahubali 2 was released.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more