»   » బాహుబలి2 కలెక్షన్ల జైత్రయాత్ర.. సంచలనాల హోరు.. 30 రికార్డులు బ్రేక్

బాహుబలి2 కలెక్షన్ల జైత్రయాత్ర.. సంచలనాల హోరు.. 30 రికార్డులు బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరుగరాస్తున్నది. బాహుబలి ధాటికి బాక్సాఫీస్ కకావికలం అవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపంలో కలెక్షన్లు కుంభవృష్టిని తలపిస్తున్నాయి. ఏప్రిల్ 28 తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 30 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. భారతీయ సినిమా పరిశ్రమలో దాదాపు అన్ని ప్రధాన రికార్డులు బాహుబలిపైనే ప్రస్తుతం నమోదు కావడం గమనార్హం. బాహుబలి క్రియేట్ చేసిన 30 రికార్డులు ఇవే..

అడ్వాన్స్ బుకింగ్ః

అడ్వాన్స్ బుకింగ్ః

ఇప్పటివరకు అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ అయిన చిత్రంగా బాహుబలి సరికొత్త రికార్డును సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రూ.36 కోట్ల రూపాయాలను వసూలు చేసింది. గతంలో అమీర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రం దాదాపు రూ.18 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డును బాహుబలిని అధిగమించింది.

థియేటర్ కౌంట్.. అక్యుపెన్సీ

థియేటర్ కౌంట్.. అక్యుపెన్సీ

థియేటర్ల కౌంట్ః దేశంలో దాదాపు 8 వేల స్క్రీన్లలో విడుదలైన చిత్రంగా బాహుబలి ఘనతను సాధించింది. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం 4350 థియేటర్లలో విడుదలైంది.
థియేటర్ ఆక్యుపెన్సీః విడుదలైన రోజు దాదాపు 95 శాతం అక్యుపెన్సీని సాధించింది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన రయీస్ చిత్రం 70 శాతం అక్యుపెన్సీని సాధించింది.

తొలిరోజు రికార్డులు..

తొలిరోజు రికార్డులు..

రిలీజైన తొలిరోజు రూ.121 కోట్ల (నికర) వసూళ్లను సాధించింది. షారుక్ నటించిన రయీస్ సినిమా సాధించిన రూ.20.4 కోట్ల వసూళ్ల రికార్డును తుడిచిపెట్టింది. అంతేకాకుండా అతివేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలిచిత్రంగా బాహుబలి ఘనతను సాధించింది.

ఓ ప్రాంతీయ చిత్రం హిందీలోకి డబ్బింగ్ అయి తొలిరోజే రూ.41 కోట్లను సాధించిన చిత్రంగా మరో ఘనతను సొంతం చేసుకొన్నది. రిలీజైన తొలిరోజే తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూ. 80 కోట్లు సాధించిన చిత్రంగా మరో రికార్డును బాహుబలిని సొంతం చేసుకొన్నది.

అమెరికాలో ప్రివ్యూ..

అమెరికాలో ప్రివ్యూ..

బాహుబలి రిలీజ్‌కు ముందు రోజు అంటే గురువారం ప్రివ్యూల ద్వారా అమెరికాలో భారీ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. అమెరికాలో రూ. 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలిచిత్రంగా రికార్డు నమోదైంది. ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ (1.9 మిలియన్ డాలర్లు), బ్యూటీ అండ్ బీస్ట్ (661 వేల డాలర్లు), బాస్ బేబీ (562 వేల డాలర్లు) రికార్డులను తిరగరాసింది.

200 కోట్ల క్లబ్‌లో..

200 కోట్ల క్లబ్‌లో..

బాహుబలి2 విడుదలైన రెండో రోజున రూ.102 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేయడం విశేషం. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం రూ.200 కోట్లు సాధించడానికి ఏడు రోజులు పట్టింది. అలాగే అమెరికాలో రెండో రోజు రూ.50 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.

వారాంతంలో ..

వారాంతంలో ..

తొలి వారాంతానికి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా బాహుబలి2 చిత్రం రికార్డు సృష్టించింది. తొలివారాంతానికి (శుక్ర, శని, ఆదివారం) రూ.526 కోట్లు వసూలు చేసింది. 2017లో విడుదలైన చిత్రాల వారాంతం కలెక్షన్లు రూ.300 కోట్లు కావడం గమనార్హం. కేరళలో వేగంగా రూ.20 కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మలయాళేతర చిత్రాలలో అధిక వసూళ్లను సాధించిన చిత్రమిదే కావడం విశేషం.

300 కోట్ల క్లబ్‌లో..

300 కోట్ల క్లబ్‌లో..

భారతీయ సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలిచిత్రంగా ఓ అరుదైన ఘనతను సాధించింది. అంతేకాకుండా తొలి వారాంతం తర్వాత సోమవారం రూ.40 కోట్లు వసూలు చేసిన చిత్రంగా మరో రికార్డు ఈ చిత్రం పేరిట నమోదైంది. గతంలో 35 కోట్లతో క్రిష్3 పేరిట ఉండేది.

600, 700 కోట్ల క్లబ్‌లలో..

600, 700 కోట్ల క్లబ్‌లలో..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా రూ.600 కోట్లు వసూలు చేసిన చిత్రంగా మరో రికార్డును ఈ చిత్రం సొంతం చేసుకొన్నది. దాదాపు రూ.625 కోట్లను కేవలం 4 రోజుల్లోనే సాధించడం విశేషం. అలాగే కేవలం 5 రోజుల్లోనే వేగంగా రూ.710 కోట్లను సాధించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే ప్రథమం..

800 నుంచి 1000 కోట్ల క్లబ్‌లోకి

800 నుంచి 1000 కోట్ల క్లబ్‌లోకి

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వారం రోజుల్లోనే రూ.800 కోట్లను వసూలు చేసింది. గతంలో బాలీవుడ్‌లో రికార్డుగా నిలిచిన అమీర్ ఖాన్ చిత్రం పీకే వసూలు చేసిన 792 కోట్ల రికార్డును అధిగమించింది. అదే ఊపును కొనసాగిస్తూ దాదాపు పదిరోజుల్లో రూ.1000 కోట్లను దాటేసింది.

అమెరికాలో మూడోస్థానంలో..

అమెరికాలో మూడోస్థానంలో..

ఉత్తర అమెరికాలో వారాంతంలో హాలీవుడ్ చిత్రాల కలెక్షన్లను అధిగమించి 3వ స్థానంలో నిలిచింది. హాలీవుడ్ తారలు టామ్ హాంక్స్, ఎమ్మా వాట్సాన్ నటించిన చిత్రం ది సర్కిల్ నాలుగో స్థానంలో నిలిచింది.

English summary
SS Rajamouli's Baahubali 2: The Conclusion has consistently been blasting past each and every box office record it can get its hands on. Ever since it was first released on April 28, the movie Baahubali 2 smashed 30 records and broken many the box-office Records.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu