»   » భళీ భళీరా.. బాహుబలి2.. 700 కోట్ల క్లబ్‌లో.. రికార్డులు తుక్కుతుక్కు.. కలెక్షన్ల మోత..

భళీ భళీరా.. బాహుబలి2.. 700 కోట్ల క్లబ్‌లో.. రికార్డులు తుక్కుతుక్కు.. కలెక్షన్ల మోత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలన విజయం సాధిస్తున్న బాహుబలి ది కన్‌క్లూజన్ రోజుకో రికార్డును తిరగరాస్తున్నది. ఎన్నో ఏళ్లుగా తుప్పుపట్టిన రికార్డులన్ని బద్దలవుతున్నాయి. ఈ సినిమా విడుదలై దాదాపు వారం కావోస్తున్నా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదనే మాట వినిపిస్తున్నది. అందుకు తగినట్టుగానే కలెక్షన్ల కూడా జలపాతంలా బాక్సాఫీస్ వద్ద దూకిపడుతున్నాయి. గత ఐదు రోజుల్లో బాహుబలి2 సినిమా రూ.700 కోట్ల మార్కును దాటేసిందని సినీ ట్రేడ్ అనలిస్టులు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు.

ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా వెల్లడించిన ప్రకారం. బాహుబలి దేశంలో స్థూలంగా రూ.565 కోట్లు, నికరంగా రూ.440 కోట్ల వసూళ్లను, ఓవర్సీస్‌లో రూ.145 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం మొత్తంగా రూ.710 కోట్ల కలెక్షన్లను సాధించింది అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రం సాధించిన రూ.769 కోట్ల రికార్డును అధిగమించే అవకాశం కనిపిస్తున్నది.హిందీలో వారాంతానికి 125 కోట్లు

హిందీలో వారాంతానికి 125 కోట్లు

బాలీవుడ్‌లో కూడా బాహుబలి2 చిత్రం ప్రభంజనం జోరుగా కొనసాగుతున్నది. ఈ చిత్రం మొదటి వారాంతానికి రూ.125 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇది హిందీ చిత్రపరిశ్రమలో ఓ రికార్డు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ రూ.105 కోట్లు, అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రూ.107 కోట్లు సాధించాయి.


తొలి రోజు రికార్డు ..

తొలి రోజు రికార్డు ..

దేశవ్యాప్తంగా మొదటి రోజే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా బాహుబలి2 మరో రికార్డును నెలకొల్పింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.53 కోట్లు, కర్ణాటకలో 11.5 కోట్లు, హిందీలో రూ.41 కోట్లు, ఇతర రాష్టాలతో కలుపుకుంటే రూ.125 కోట్లు వసూలు చేసింది.


అమెరికాలో వారాంతానికి..

అమెరికాలో వారాంతానికి..

అమెరికాలో తొలి వారాంతంలో కూడా బాహుబలి భారీ కలెక్షన్లను రాబట్టింది. కేవలం అమెరికాలోనే ఈ చిత్రం రూ.65.65 కోట్లు వసూలు చేసింది. విన్ డిజెల్ నటించిన ఫాస్ట్ అండ్ ఫూరియస్, సల్మా హయెక్ నటించిన లాటిన్ లవ్ చిత్రాల తర్వాత మూడో స్థానంలో బాహుబలి నిలిచింది.


మూడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో..

మూడు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో..

విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును దాటిన చిత్రంగా బాహుబలి2 మరో రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా రూ.395 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్‌లో రూ.125 కోట్లను సాధించింది.


నాలుగు రోజులకు రూ.625 కోట్లు

నాలుగు రోజులకు రూ.625 కోట్లు

గత నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాహుబలి రూ.625 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో రూ.490 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.135 కోట్ల (గ్రాస్) వసూళ్లను సాధించింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.


24 గంటల్లో రూ.100 కోట్లు

24 గంటల్లో రూ.100 కోట్లు

దేశ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బాహుబలి కేవలం 24 గంటల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటింది. తొలిరోజు రూ.125 కోట్ల వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఇదో రికార్డుగా నమోదైంది.


66 ఐమాక్స్ థియేటర్లలో కూడా..

66 ఐమాక్స్ థియేటర్లలో కూడా..

బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 66 ఐమాక్స్ థియేటర్లతో ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం తొలి వారాంతానికి రూ.14.77 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఐమాక్స్ విషయంలో బాహుబలి2 సరికొత్త రికార్డును సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది.


బాలీవుడ్ చిత్రాల రికార్డులకు ముప్పు..

బాలీవుడ్ చిత్రాల రికార్డులకు ముప్పు..

ఇప్పటివరకు బాలీవుడ్‌లో పీకే రూ. 792 కోట్లు, దంగల్ చిత్రం 744 కోట్లు, భజ్‌రంగీ భయ్‌జాన్ చిత్రం రూ.626 కోట్లు, సుల్తాన్ రూ. 589 కోట్లు, ధూమ్3 రూ. 558 కోట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రికార్డుల్లో కొన్ని ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా పీకే చిత్రం కలెక్షన్లను అధిగమించనున్నది.


పీకే రికార్డు తడిచిపెట్టడానికి...

పీకే రికార్డు తడిచిపెట్టడానికి...

బాహుబలి త్వరలోనే అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా రికార్డులను తడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నది. పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.792 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ సినిమా చరిత్రలో ఇదే అత్యుత్తమ రికార్డు. ఈ రికార్డు త్వరలోనే అధిగమిస్తుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.
English summary
The film Baahubali2, starring Prabhas, Rana Daggubati, Anushka Shetty and Tamannaah continues shatter box office records. Trade analyst Ramesh Bala has gone one step further and estimated that Baahubali 2: The Conclusion has crossed the Rs 700-crore mark in gross collections worldwide. IMAX noted that Baahubali 2 grossed Rs 14.77 crore in its opening weekend from 66 IMAX theatres which includes theatres in India, North America, Australia, Middle East and Africa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu