»   » ‘బాహుబలి-2’వస్తోంది: దసరా రోజు రిలీజ్ పెట్టుకోకండి

‘బాహుబలి-2’వస్తోంది: దసరా రోజు రిలీజ్ పెట్టుకోకండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి తర్వాత తెలుగువారికి పెద్ద పండుగ దసరా. అందుకే దసరా నవరాత్రులలో తమ సినిమాను విడుదల చేయాలని స్టార్ హీరోలు, డైరక్టర్స్ ప్లాన్ చేస్తూంటారు. అది సాధ్యం కానివారు ఆ రోజు పోస్టరో, టీజరో విడుదల చేసి విషెష్ చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు. ఇప్పుడు దసరాకు అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకునే ప్లాన్ ప్రయత్నం చేస్తోంది బాహుబలి 2 టీమ్.

ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రస్తుతం రెండవ భాగంగా బాహుబలి ది కంక్లూజన్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ పై అంతటా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టీజర్ ని దసరా రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


 Baahubali 2 teaser as Dasara treat?

దసరా రోజున కనుక రిలీజ్ చేస్తే..ఆ రోజు మీడియా మొత్తం ఈ చిత్రం గురించే మాట్లాడటం ఖాయం. మిగతా ఎన్ని పెద్ద సినిమాలు ఆ రోజు రిలీజైనా జనం దృష్టి మొత్తం బాహుబలి మీదే ఉండటం ఖాయం. అందుకే దసరా రోజు రిలీజ్ పెట్టుకుంటే మీడియా పబ్లిసిటీ మాత్రం రాదని అంటున్నారు. ముందో, వెనకో రిలీజ్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్తున్నారు.


'బాహుబలి-2' రిలీజ్ డేట్ ఇచ్చారు... (ఫోటోస్)


2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.


 Baahubali 2 teaser as Dasara treat?

బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది.


ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.

English summary
it is coming out that Baahubali The Conclusion's teaser will be released as Dasara present.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu