»   » ఓవర్సీస్‌లో ‘బాహుబలి-2’.... ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్

ఓవర్సీస్‌లో ‘బాహుబలి-2’.... ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ 'బాహుబలి-2' విడుదలై అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 10 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది.

ఇంత భారీ మొత్తం వసూలు చేయడం ఇండియన్ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. సినిమా ఫుల్ బిజినెస్ పూర్తయ్యే సమయానికి వసూళ్ళు ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ల నుండి అందుతున్న సమాచారం మేరకు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..


యూఎస్ఏలో...

యూఎస్ఏలో...

యూఎస్ఏలో ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం... $ 7,892,145 (రూ 50.72 కోట్లు] వసూలు చేసింది. ఆదివారం పూర్తి కలెక్షన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ మొత్తం కలిపితే 9 మిలియన్ డాలర్లు క్రాస్ చేస్తుందని టాక్.


న్యూజిలాండ్

న్యూజిలాండ్

న్యూజిలాండ్ నుండి ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం... హిందీ వెర్షన్ శుక్రవారం $ 84,782, శనివారం $115,398 వసూలు చేసింది. టోటల్ $ 200,180 [88.29 లక్షలు] వసూలు చేసింది.


ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో హిందీ వెర్షన్ శుక్రవారం $ 211,996, శనివారం $ 325,678 వసూలు చేసింది. రెండు రోజుల్లోనే మొత్తం $ 537,674 (రూ. 2.59 కోట్లు) రాబట్టంది.


ఓవరాల్ గా

ఓవరాల్ గా

ఓవర్సీస్ లో ఇతర ఏరియాల కలెక్షన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. సినిమా జోరు చూస్తుంటే ఓవర్సీస్ లో అన్ని లాంగ్వేజ్ వెర్షన్లు కలిపి...... ఓవరాల్ గా రూ. 150 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.English summary
Baahubali 2 Touches $ 10 Million in overseas. This is a new record in the overseas market and with plenty of days to go, it is doubtful whether there would be another film in the near future which can even come close to these kinds of collections in any Indian language.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu