Baahubali The Epic Box Office: రీ రిలీజ్‌లలో బాహుబలి ది ఎపిక్ సరికొత్త చరిత్ర.. అడ్వాన్స్ బుకింగ్‌లో ఎంతంటే?

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యాలుగా ఈ రెండు చిత్రాలు నిలిచిపోతాయి. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు పాన్ ఇండియా కల్చర్‌కు బాహుబలి సిరీస్ శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం తర్వాత దక్షిణాది నుంచి అనేక పాన్ ఇండియా సినిమాలు హిందీ పరిశ్రమపై దండయాత్ర చేశాయి. సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ పునాదులు కదిలిపోయాయి.

బాహుబలి తారాగణం
ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, నాజర్ తదితరులు నటించిన బాహుబలి సిరీస్‌‌ను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటిండ్ నిర్వహించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ పేరుతో 2015 జూలై 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాహుబలికి ది బిగినింగ్‌కు 650 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

Baahubali The Epic Day 1 Advance Booking Collections Worldwide Prabhas s Movie Box office Report details

చరిత్ర సృష్టించిన బాహుబలి
ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. 2017 ఏప్రిల్ 28న రిలీజైన బాహుబలి 2.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ టూ కోలీవుడ్ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో బాహుబలిని కూడా రీ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. దీనిలో భాగంగా బాహుబలి 1, బాహుబలి 2 రెండింటిని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. అందుబాటులోకి వచ్చిన సరికొత్త సాంకేతికను బాహుబలికి జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఐమాక్స్, డీ బాక్స్, ఐస్, 4dx, ఎపిక్, డాల్బీ విజన్ ఫార్మాట్స్‌లో బాహుబలి ది ఎపిక్ విడుదల కానుంది.

రీ రిలీజ్‌ బిజినెస్‌లో కొత్త రికార్డులు
రీ రిలీజ్‌లోనూ బాహుబలి చరిత్ర సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఒక్క నైజాం ఏరియాలోనే బాహుబలి ది ఎపిక్ 17 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేస్తుందని అంచనా. అలాగే సీడెడ్‌లో 4.50 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 14 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లోనే 36 కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. దీనితో పాటు హిందీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి.

అడ్వాన్స్ బుకింగ్‌తో ఎన్ని కోట్లంటే?
ఇక నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అక్టోబర్ 24వ తేదీ వరకు ఒక్క యూఎస్‌లోనే అడ్వాన్స్ బుకింగ్ కింద 121 లోకేషన్స్‌లో, 137 షోలకు గాను.. 2,05,467 డాలర్లు (భారత కరెన్సీలో 1.80 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్‌లో బాహుబలి సంచలనం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో బాహుబలి ది ఎపిక్‌‌కు బుక్ మై షోలో 61.24K టికెట్స్ అమ్ముడైనట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ప్రభాస్ మూవీకి 1.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా ఒక్క అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే బాహుబలి ది ఎపిక్ మూవీకి 3 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో బాహుబలి ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X