Baahubali The Epic Day 4 Collections: గ్లోబల్ చార్ట్‌లో బాహుబలి ది ఎపిక్.. రాజమౌళి మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నమోదైన ప్రీ సేల్స్ కలెక్షన్లు ఎంత? తొలి రోజు వసూళ్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 650 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా మొత్తం థియేట్రికల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో కలిపి 203 కోట్ల రూపాయల షేర్, 295 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 107 కోట్లు, తమిళనాడులో 127 కోట్లు, కేరళలో 62 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 10 కోట్లు, నార్త్ ఇండియాలో 514 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 1400 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్లకు ఇండియాలో భారీగా స్పందన లభించింది. తక్కువ స్క్రీన్లలో ప్రదర్శించినప్పటికీ ఈ చిత్రం 1.2 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తొలి రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో 8 కోట్ల రూపాయలు, హిందీలో 1.5 కోట్ల రూపాయలు, కన్నడలో 1.5 కోట్లు, తమిళంలో 70 లక్షలు, మలయాళంలో 30 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రెండో రోజు విషయానికి వస్తే.. కన్నడలో 1.25 కోట్లు, తెలుగులో 4.5 కోట్ల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 30 లక్షలు, హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో ఇండియాలో 21.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
అలాగే మూడో రోజు విషయానికి వస్తే.. ఆదివారం ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ ప్రభావం ఎక్కువగానే ఈ సినిమా కలెక్షన్లపై పడినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం కన్నడలో 1 కోటి రూపాయలు, తెలుగులో 3.5 కోట్ల రూపాయలు, తమిళంలో 85 లక్షల రూపాయలు, మలయాళంలో 30 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ తెలిపింది. 7.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో 29 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో సుమారుగా 600K డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 5.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 34 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలివారం ముగిసే సరికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయల మైలురాయిని దాటే అవకాశం ఉంది అని రాన్‌టాక్ ఇండియా వెల్లడించింది. ఈ చిత్రం గ్లోబల్ చార్ట్ బస్టర్స్‌లో టాప్ 10 లో చోటు సంపాదించడం మరో విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











