»   » బాలకృష్ణ ‘లయన్’ ఆడియో విడుదల తేదీ

బాలకృష్ణ ‘లయన్’ ఆడియో విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ‘లయన్'. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని మార్చి 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


Balakrisha's Lion audio on 28th March ?

బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.


త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.


Balakrisha's Lion audio on 28th March ?

నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.


అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు


బాలకృష్ణ సినిమా షూటింగ్ లతో పాటు ప్రజాసేవకి కూడా సమానంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. బాలకృష్ణ ఈ సినిమా పూర్తి కాగానే శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కూడా మార్చిలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

English summary
Nandamuri Balakrishna's latest project titled ‘Lion’ post production work is going in good swing and will be completed very soon. Makers are planning to release the audio of this much awaited project on 28th March.
Please Wait while comments are loading...