టాలీవుడ్ లో మరో మెగా ఫైట్.. బాలయ్య vs చిరు, అంతా జక్కన్న చేతుల్లోనే?
కరోనా దెబ్బ మామూలుగా లేదు. దాదాపు అందరి ప్లాన్స్ ము ఈ కరోనా ప్రభావితంచేసింది. అందుకే మునుపు ఊహించని రీతిలోపోటాపోటీగాసినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

మళ్లీ మెగా వార్
మెగాస్టార్ చిరంజీవి, నరసింహ నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతున్నట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరు హీరోలు ఎన్నోసార్లు ఒకే సమయంలో వారిద్దరి సినిమాలను పోటాపోటీగా విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీరిద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ తమ సినిమాలను అటూ ఇటుగా ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఆచార్య vs అఖండ
అయితే వీరికి ఇప్పుడు అడ్డంగా మారింది రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్". అసలు సంగతి ఏంటి ? చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ కు రాజమౌళి సినిమా ఎలా కారణం అయింది? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిరంజీవి ప్రస్తుతం "ఆచార్య" చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య" చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.

అఖండ రెడీ
మరోవైపు బాలయ్య... హీరోగా నటిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "అఖండ". బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం గురించి "రోర్ ఆఫ్ అఖండ" అంటూ రిలీజ్ చేసిన బాలయ్య ఇంట్రో వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో అయినా అఘోరా పాత్రలో నటించడం మరో విశేషం. వీడియో తోనే ఆకట్టుకున్న బాలయ్య ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు అయితే పెంచేశాడు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాడో చూడాలి మరి.

అఖండ, ఆచార్య మధ్య పోటీ
"అఖండ"గా బాలయ్య, "ఆచార్య"తో చిరంజీవి ఒక వారం గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. మామూలుగా అయితే ఇద్దరు సీనియర్ హీరోలు దసరా బరిలో నిలవడానికి ముందు నుంచి సిద్ధమయ్యారు. మరోవైపు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ "ఆర్ఆర్ఆర్" దసరాకు రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అక్టోబర్ 13న సినిమా రిలీజ్ అని డేట్ పద్దాకా ప్రచురిస్తున్నారు. అయితే కరోనా కారణంగా సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అందరూ భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

అంతా జకన్న మీదే
ఆర్ ఆర్ ఆర్ టీమ్ చేయబోయే ప్రకటన గురించే ఆచార్య, అఖండ మేకర్స్ వెయిటింగ్ లో ఉన్నాయని అంటున్నారు. పొరపాటున "ఆర్ ఆర్ ఆర్" రిలీజ్ డేట్ ను మార్చుకుంటే ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంటాయి. రాజమౌళి మాత్రం దసరా కానుకగా అక్టోబర్ 13నే "ఆర్ఆర్ఆర్"ను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే అదే డేట్ తో పోస్టర్లు వదులుతున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో అనేది.


Click it and Unblock the Notifications











