»   »  "లెజెండ్'' : కలెక్షన్స్ పై నిర్మాతల మాట నిజమేనా?

"లెజెండ్'' : కలెక్షన్స్ పై నిర్మాతల మాట నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యాభై కోట్లు వచ్చాయని, ఈరేర్ ఫీట్ తాజా చిత్రం "లెజెండ్'' ద్వారా సాధించారని స్వయంగా ఆ చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ ప్రకటనలో ... బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. తొలి వారంలోనే 33 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి రికార్డ్ ను సృష్టించింది. ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది.

నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం. త్వరలోనే లెజెండ్ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొని ఉన్న రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లెజెండ్ విజయానందంలో ఉన్న నందమూరి అభిమానులకు బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం నూతనోత్సహాన్నిచ్చింది అన్నారు.

 Balakrishna's 'Legend' in 50 Cr club


2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోతున్నాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

ముఖ్యంగా రాజకీయాలు పుట్టిందే మా వంశంలో రా.. అని బాలయ్య గర్జించిన తీరు విశ్వనటసా ర్వభౌముడు ఎన్టీఆర్‌ని తలపించింది. లెక్కకు మిక్కిలిగా బాలయ్య విసిరిన పంచ్‌లకు థియేటర్లలో విజిల్స్‌ పడుతున్నాయి. ఇటు అభిమానులే కాక, అటు సామాన్య ప్రేక్షకుల్లోనూ హుషారు తెచ్చింది ఈ సినిమా. ఏపీతో పాటు చెన్నయ్‌, బెంగళూరు, విదేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోందని సమాచారం. వారాహి చలనచిత్రం, 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి

వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థలకు "లెజెండ్'' చిత్రం మరో భారీ హిట్ ను అందించింది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుపై పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగిస్తోందని వారు తెలిపారు.

English summary

 14 Reels Entertainment has released a press note stating “Legend” has raked in Rs.33 crore in its first week run and trade pundits predicted that the film may register 50 crore at Box Office. Making trade pundits predictions correct , Legend has crossed Rs.50 crore mark and gave a oxygen to Tollywood film industry, which is suffering without any proper hit, says the pressnote.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu