»   » ఖరారు :‘లయిన్’ మారిన విడుదల తేదీ...ముహూర్తం

ఖరారు :‘లయిన్’ మారిన విడుదల తేదీ...ముహూర్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ తాజా చిత్రం ‘లయిన్' విడుదల తేదీ, ముహూర్తం ని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం మే 8న విడుదల అవుతుంది. మొదట ఆట ...10.04 నిముషాలకు ఉదయం ప్రారంభమవుతుంది. అంతా మే 1 అనుకున్న తర్వాత రిలీజ్ వాయిదా పడటంతో అభిమానులు కంగారు పడ్డారు. అందుకోసం ఇదిగో ఇలా రిలీజ్ డేట్ ప్రకటించి ఆనందపరిచారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నిజాయతీని నమ్ముకొన్న సీబీఐ అధికారి అతను. అయితే 'చట్టం తనపని తాను చేసుకుపోతుంది..' తరహా రొటీన్‌ డైలాగులు చెప్పడు. చట్టం కంటే వేగంగా స్పందిస్తాడు. న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలపై నమ్మకం ఉన్నా.. తనే ఓ న్యాయస్థానమై న్యాయమూర్తిగా తీర్పులిచ్చాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు. అతని కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'లయన్‌'.


నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. మే 8 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


Balakrishna's ‘Lion’ release date and muhurat fixed!!!

''సీబీఐ అధికారి పాత్రలో బాలకృష్ణ నట విశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చు. ఆయన పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుంది. ప్రచార చిత్రాల్లో బాలకృష్ణ పలికిన సంభాషణలకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ పాటలు మాస్‌కి బాగా నచ్చాయి. ''అని నిర్మాతలు చెబుతున్నారు.


అలాగే ‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు.


నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.


అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Balayya’s “Lion” featuring Trisha and Radhika Apte in the leads will be releasing on May 8th. First show will be screened on the muhurat of 10.04 am and only afterwards the world gets to watch it.
Please Wait while comments are loading...