»   » బాలయ్య ప్రకటన :ఎన్టీఆర్, చరణ్ లకు ట్విస్టే, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో

బాలయ్య ప్రకటన :ఎన్టీఆర్, చరణ్ లకు ట్విస్టే, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలకృష్ణ పూరి జగన్నాథ్‌ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం నిన్న ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకు ఇది 101వ చిత్రం కావడం, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తొలి చిత్రం కావటంతో ఖచ్చితంగా ఓ రేంజిలో క్రేజ్ ఉంటుంది. అయితే ఇవన్ని పెద్ద విషయం కాదు కానీ...ఈ సినిమాను విజయ దశమికి విడుదల చేయనున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా దసరా సీజన్ పై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఇది ఊహించని విషయమే.

తమ సినిమా రిలీజ్ వల్ల పోటీలో ఉండే వేరే సినిమాల రిలిజ్ డేట్స్ ఇబ్బంది పడకూడదని, క్లాప్ కొడుతున్న సమయంలోనే క్లారిటీ ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ , చెప్రీ లకు...పరోక్షంగా ..నేను ఈ సీజన్ లో వస్తున్నారు. మీరు వేరే రిలీజ్ డేట్ చూసుకోండి అని చెప్పినట్లైంది అంటున్నారు సినిమా జనం.

Balakrishna's new movie release date Announcement Stuns NTR, Charan

గత కొద్ది కాలంగా బాలయ్య చిత్రాలు భాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీనే ఎదుర్కొంటున్నాయి. ఆయన 99 వ చిత్రం డిక్టేటర్ కు ఎన్టీఆర్ ..నాన్నకు ప్రేమతో చిత్రం, నాగార్జున..సోగ్గాడే చిన్ని నాయినా చిత్రం పోటీగా నిలిచాయి. అలాగే... ఆయన లాండ్ మార్క్ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణికు చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 పోటీగా నిలిచింది. ఈ నేపధ్యంలో ఇలాంటి క్లాష్ లను నివారించాలనే ఉద్దేశ్యంలోనే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేసి ప్రకటించేసారు.

మరో ప్రక్క ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ, రామ్ చరణ్ ,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాలు దసరా సీజన్ లో రావాలని ఫిక్స్ అయ్యాయి. మరి ఈ రెండింటిలో ఏవి వెనక్కి వెళ్తాయో చూడాలి. ఏది బాలయ్య సినిమాని ఢీ కొనబోతోందనేది ఎదురూచూడాల్సిన అంశం.

మరో ప్రక్క తమ బాబాయ్ అయిన బాలయ్యతో పోటీ పడటానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంత వరకూ ఇష్టపడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. మరో ప్రక్క సుకుమార్, రామ్ చరణ్ కాంబో లో రెడీ అవుతున్న చిత్రం జూలైకు షూటింగ్ పూర్తి అవుతుంది. చరణ్ ఎట్టిపరిస్దితుల్లోనూ దసరా స్లాట్ ని మిస్ చేసుకునే ఉద్దేశ్యంలో లేరని చెప్తున్నారు. అదీ విషయం.

English summary
NTR's 'Jai Lava Kusa' and Ram Charan's film with Sukumar are also targeting the Dasara season only. Puri announced that #NBK101 will hit screens on September 29, for Dasara festival season. The announcement is being seen as a strategic move by both Puri and Balayya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu