»   » వందో చిత్రం: బాలయ్యతో అంటే మాటలా.... క్రిష్ కి షాక్, కొన్ని డౌట్స్

వందో చిత్రం: బాలయ్యతో అంటే మాటలా.... క్రిష్ కి షాక్, కొన్ని డౌట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు క్రిష్ ఊహించని విధంగా బాలయ్య వందో చిత్రం సీన్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు క్రిష్ కి ఆశ్చర్యం,ధ్రిల్ కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. అంత బడ్జెట్ పెడుతున్నారు.. బాలయ్య, క్రిష్ కాంబినేషన్ కు అంతా స్టామినా ఉందా.. అని ప్రశ్నించివాళ్లకు సమాధానం చెప్పే సమయం వస్తుందంటున్నారు.

బాలయ్య వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఉగాది రోజు లాంచ్ చేసారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైంది.

Also Read: బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి':ఆశ్చర్యపరిచే విషయాలు, 99లో 17 అవే

అయితే ఆ రోజు నుంచే ఈ చిత్రానికి బిజినెస్ ఆఫర్స్ , ఎంక్వైరీలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. దాంతో క్రిష్ గత చిత్రాలకు ఎప్పుడూ జరగని విధంగా బిజినెస్ క్రేజ్ రావటం చూసి చాలా ఆనందపడుతున్నాడట..అంతేకాదు బోల్డు థ్రిల్ ఫీలవుతున్నాడని సమాచారం..

షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ స్దాయిలో ఉండటంతో ఆయన సంతోషానికి పగ్గాలు లేవంటున్నారు. తనే నిర్మాతగా కూడా వ్యవరిస్తూ మొత్తం భాధ్యతలు తీసుకోవటంతో ఈ బిజినెస్ ఆఫర్స్ మరింత సంతోషాన్ని కలిగిస్తునట్లు చెప్తున్నారు.

Also Read: 'బాహుబలి' రేంజిలో బాలయ్య వందో మూవీ, బడ్జెట్ వెల్లడించిన క్రిష్

ఇకఈ సినిమాకు దర్శకులుగా బోయపాటి శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు వినిపించినా.., ఫైనల్ గా క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు బాలకృష్ణ. శాతవాహన రాజు గౌతమీ పుత్రశాతకర్ణి పాత్రలో బాలయ్య నటించనున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించడానికి రెడీ అవుతున్నారు.

అయితే ట్రేడ్ లో మాత్రం ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి రిస్కే అన్నారు..

ట్రేడ్ లో చెప్పే లెక్కలు...స్లైడ్ షో లో

వారాహితో కలిసి..

వారాహితో కలిసి..

వారాహి చలనచిత్ర నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి క్రిష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు.

అమ్మో అంతా..

అమ్మో అంతా..

50 కోట్ల బడ్జెట్ తో భారీగా ఈ సినిమాను రూపొందించడానికి రెడీ అవుతున్నారు.

మొరాకోలో..

మొరాకోలో..

అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు మొరాకోలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సెట్స్ ,గ్రాఫిక్స్

సెట్స్ ,గ్రాఫిక్స్

భారీ సెట్ లు అదే స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే అవుతుందని అంచనా వేస్తున్నారు.

వర్క్ అవుట్ అవుతుందా

వర్క్ అవుట్ అవుతుందా

అయితే బాలకృష్ణ మార్కెట్ పరంగా అంత బడ్డెట్ వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ బిజినెస్ ఆఫర్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు.

ఒక్కసారే..

ఒక్కసారే..

ఇప్పటి వరకు బాలకృష్ణ ఒకే ఒక్కసారి లెజెండ్ సినిమాతో 40 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యాడు.

పెద్ద హిట్టైన

పెద్ద హిట్టైన

హై సక్సెస్ సాధించిన సింహాతో రూ. 30 కోట్లు. రీసెంట్ సినిమా డిక్టేటర్ తో 20 కోట్లకు పైగా వసూళ్లు చేసిన బాలకృష్ణ,

సాధ్యమేనా

సాధ్యమేనా

50 కోట్ల సినిమా బాలయ్య చేస్తే ఆ మొత్తాన్ని కలెక్షన్ల రూపంలో వసూలు చేయటం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ట్రాక్ రికార్డ్ ఏది

ట్రాక్ రికార్డ్ ఏది

డైరెక్టర్ క్రిష్ రికార్డ్ కూడా కలెక్షన్ల విషయంలో అంతా గొప్పగా లేదు. ఆ ట్రాక్ రికార్డ్ లేకపోవటమే కంగారుపెట్టే అంశం.

కంచె కూడా కష్టమైంది

కంచె కూడా కష్టమైంది

తన కెరీర్ లో క్రిష్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కంచె. అది కూడా 20 కోట్ల సినిమానే. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

ఎంత రావాలి

ఎంత రావాలి

50 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తే దాదాపు 70 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది

తెలుగు వీరుని కథ..

తెలుగు వీరుని కథ..

''నా వందో సినిమా కోసం ఎన్నో కథలు విన్నా. ఇంకా ఏదో కావాలనిపించేది. ఆ క్రమంలోనే క్రిష్ చెప్పిన కథ విన్నా. 'గౌతమీపుత్ర శాతకర్ణి' స్క్రిప్ట్ విన్నాక ఇంత కాలం దీనికోసమే ఆగానేమో అనిపించింది. ఎందుకంటే ఇది తెలుగు వీరుడి కథ'' అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

నాన్నగారు చేద్దామనుకున్నారు..

నాన్నగారు చేద్దామనుకున్నారు..

'వాస్తవానికి 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీయార్ చేద్దామనుకున్నారు. కొన్నాళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కానీ, ఎందుకనో ఆ సినిమా ఆగి పోయింది. ఆ విషయం నాకూ ఈ మధ్యనే తెలిసింది. క్రిష్‌కూ, నాకూ నాన్నగారే సంధానకర్తగా వ్యవహరించారేమోనని అనిపిస్తోంది అని బాలకృష్ణ అన్నారు.

ఎవరూ టచ్ చేయలేదు..

ఎవరూ టచ్ చేయలేదు..

''ముక్కలు ముక్కలుగా ఉన్న భారతాన్ని ఒక్కటి చేసి పాలించిన శాతకర్ణి జీవితం ఆధారంగా, ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీస్తున్నందుకు సంతో షంగా ఉంది. ఈ ఛాన్సిచ్చిన బాలకృష్ణగారికి కృత జ్ఞతలు'' అని క్రిష్ చెప్పారు.

మొరాకోనే ఎందుకు

మొరాకోనే ఎందుకు

ప్రపంచంలో చారిత్రక వాతావరణం ఉన్న ప్రదేశాల్లో మొరాకో ఒకటి. అక్కడ సహజ వాతావరణం ఉంది. పురాతనమైన కోటలు, కట్టడాలు ఉన్నాయి. రాజు కథ కాబట్టి యుద్ధ సన్నివేశాలూ ఉంటాయి. వాటిని తీయడానికి కావలసిన విశాలమైన మైదాన ప్రాంతాలు మొరాకో లో చాలా ఉన్నాయి.

English summary
‘Gautamiputra Satakarni’can bring in solid business offers and even before shooting has started, good enquiries are coming in for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu