»   » బాక్సాఫీసు వద్ద బాలయ్య ‘లెజెండ్’ పరిస్థితి ఏమిటి?

బాక్సాఫీసు వద్ద బాలయ్య ‘లెజెండ్’ పరిస్థితి ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నట సింహం బాలయ్య నటించిన 'లెజెండ్' చిత్రం 50 కోట్ల క్లబ్బులో చేరబోతోందంటూ ఆ చిత్ర నిర్మాతలు ఈ మధ్య తెగ ప్రచారం చేయించిన సంగతి. వారు స్వయంగా ఈ విషయాన్ని వారి నోటితో చెప్పక పోయినా.....సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ విభాగం ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడానికి కృషి చేసాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'లెజెండ్' చిత్రం 50 కోట్ల క్లబ్బులో చేరే పరిస్థితి బాక్సాఫీసు వద్ద లేదని తెలుస్తోంది. లెజెండ్ చిత్రం విడుదల రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు తొలి వారం బాక్సాఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్లు సాధించింది. అయితే రెండో వారం నుండి బిజినెస్ తగ్గడంతో పాటు.....'రేసు గుర్రం' చిత్రం విడుదల తర్వాత కలెక్షన్ల జోరు మరింత తగ్గిందని అంటున్నారు.

Balayya Legend Movie Box Office Collections

'లెజెండ్' మూవీ టోటల్ ఫుల్ రన్‌లో కూడా నిర్మాతల చేతికి వచ్చే మొత్తం రూ. 40 కోట్లు మించే పరిస్థితి లేదని తెలుస్తోంది. అయితే ఇదంతా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మాత్రమే. 'లెజెండ్' చిత్రం కలెక్షన్ల గురించిన అసలు వాస్తవాలను నిర్మాతలు వెలుగులోకి తెస్తే తప్ప....అభిమానుల్లో నెలకొన్న అయోమయం తొలిగే పరిస్థితి కనిపించడం లేదు.

బాలయ్య, జగపతి బాబు, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలు పోషించిన నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి ఈచిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వం వహించారు.

English summary
Film Nagar reports said that, Balayya Legend movie fails reached 50 crore mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu