twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 30 Days Collections: ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించిన బంగార్రాజు.. 2022 మొదటి హిట్

    |

    అక్కినేని హీరోలు నాగ చైతన్య నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా మొదటి రోజు బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ అయితే గట్టిగానే అందుకుంది. కానీ ఫెస్టివల్ సీజన్ తర్వాత మాత్రం మెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ సినిమా అనుకున్న టార్గెట్ ను పూర్తి చేయడానికి నెల రోజుల సమయం పట్టింది. ఇక ఈ ఏడాది క్లీన్ హిట్ గా నిలిచిన మొదటి సినిమాగా బంగార్రాజు నిలిచింది. ఇక సినిమా మొత్తం కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్

    బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్

    వరల్డ్ వైడ్ గా బంగార్రాజు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ఇలా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.17 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం.

     బుల్లితెరపై కూడా

    బుల్లితెరపై కూడా

    సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కొనసాగింపుగా వచ్చిన బంగార్రాజు సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా చేసిన ప్రమోషన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా బుల్లితెరపై కూడా నాగార్జున ఈ సారి కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు.

     పండగ తరువాత డౌన్

    పండగ తరువాత డౌన్

    ఇక బంగార్రాజు సినిమా మొదటి రోజే మంచి వసూళ్లను అందుకుని ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చింది. కానీ ఆ హవా కేవలం సెలవుల వరకు కొనసాగింది.. పండగ సీజన్ తర్వాత సినిమా వసూళ్లు మెల్లగా తగ్గుతూ వచ్చాయి మధ్య మధ్యలో కాస్తా పెరుగుతూ వచ్చినప్పటికీ కూడా సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ను ఫినిష్ చేయడానికి మాత్రం నానా కష్టాలు పడింది అనే చెప్పాలి.

    20 రోజుల తరువాత

    20 రోజుల తరువాత

    మొదటి వారంలోనే బంగార్రాజు సినిమా భారీగానే వసూళ్లను సాధించింది. మిగతా రోజుల్లో మాత్రం ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. 20 రోజులకు వచ్చేసరికి ఆంధ్ర నైజాంలో చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. మొన్నటివరకు 10 లక్షల షేర్ రాగా ఆ తరువాత అవి కూడా రాలేదు. ఇక బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను ఫినిష్ చేసేందుకు బంగార్రాజు గట్టిగానే చెమటోడ్చింది. కలెక్షన్స్ తగ్గడంతో రెండు వారాల అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ చేయడం మానేశారు.

    టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..

    టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..

    30 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 36 కోట్లు షేర్ సాధించిన బంగార్రాజు.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.51 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 30 రోజుల్లో రూ. 39 కోట్లకూబ్పైగా షేర్‌తో పాటు రూ. 66 కోట్లకు పైగా గ్రాస్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    టార్గెట్ ఫినిష్..

    టార్గెట్ ఫినిష్..

    నెల రోజుల్లో దాదాపు ఈ సినిమా హవా మొత్తం ముగిసింది. మొత్తానికి సినిమా థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోతుంది అనే సమయంలో అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఏపీలో టికెట్ల రేట్లు ఎప్పటిలాగానే ఉంటే మరిన్ని వసూళ్లు అందేవి. వరల్డ్ వైడ్ గా రూ. 39 కోట్లు మేర బిజినెస్ చేసిన ఈ మూవీ ఫైనల్ గా నెలరోజుల్లో ఆ టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇక డీజే టిల్లు, ఖిలాడి సినిమాలు విడుదల అయ్యాయి కాబట్టి వాటి ప్రభావం గట్టిగానే చూపించింది గాని అనుకున్నట్లుగా 2022లో మొదటి క్లీన్ హిట్ గా బంగార్రాజు నిలిచింది.

    English summary
    Bangarraju movie 30 days world wide collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X