»   » అల్లు శీను, రెబెల్ అడ్డుపడ్డా... 'గంగ' గేటు దాటుతోంది

అల్లు శీను, రెబెల్ అడ్డుపడ్డా... 'గంగ' గేటు దాటుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే... 'గంగ' మ్యాటర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనేదే. బెల్లంకొండ కు చెందిన అప్పులు, లారెన్స్..రెబెల్ కు సంభందించిన తల నొప్పులు ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు అడ్డు పడ్డాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...పెద్దలంతా కూర్చుని...తమిళంలో హిట్టైన సినిమాను ఇంకా ఆలస్యం చేస్తే తెలుగులో స్టేల్ అయిపోతుంది కాబట్టి కొంత క్లియర్ చేసి, రిలీజ్ కు ఒప్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లుడు శ్రీను కి చెందిన అప్పులు, రెబెల్ కు చెందిన బాకీలు అడ్డు పడ్డాయి. వాటిలో కొంత తీర్చి...దిల్ రాజు అండతో బయిటపడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


లారెన్స్ కు రెగ్యులర్ యాక్షన్ సినిమాల కన్నా హర్రర్ కామెడీలో బాగా అచ్చి వచ్చాయి. ఆ జానర్ లో చేసిన 'ముని', 'కాంచన'... లారెన్స్‌ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచి, ఘన విజయం సాధించాయి. ఓ వైపు భయపెడుతూనే మరోవైపు నవ్వించిన ఈ కథలు.. బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రాలకు సీక్వెల్‌గా 'గంగ' వస్తోంది. ఇప్పటికే తమిళంలో హిట్టవటంతో అందరూ హుషారుగా ఈ చిత్రం ఇక్కడ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.


Bellamkonda confirms the arrival of “Ganga”

లారెన్స్‌, తాప్సి, నిత్య మేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. లారెన్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్‌ నిర్మాత. వచ్చే నెల 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


నిర్మాత మాట్లాడుతూ ''కాంచన' మా సంస్థ నుంచే విడుదలైంది. ఆ చిత్రం ఘన విజయం అందుకొంది. ఇటీవల తమిళంలో విడుదలైన 'గంగ' అక్కడ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తెలుగులోనూ అదే ఫలితం వస్తుందన్న నమ్మకం ఉంది. లారెన్స్‌ నటన, దర్శకత్వ ప్రతిభ, తాప్సి, నిత్య మేనన్‌ గ్లామర్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే 'ముని 4' కూడా ప్రారంభిస్తాము''అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.


లారెన్స్‌ తన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన 'కాంచన 2' మంచి పేరు తెచ్చుకుంది. అదేస్థాయిలో తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమో పాటను రూపొందించారు లారెన్స్‌.


Bellamkonda confirms the arrival of “Ganga”

సినిమాలో తొలి పాట 'సిలాట్ట మిల్లాట్ట..' అనే పాటతో ప్రత్యేక ప్రొమోను రూపొందించారు. ఇందులో లారెన్స్‌, నిత్యామేనన్‌, తాప్సీలు నటించారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను సినిమాలో జతచేర్చనున్న విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. మరోవైపు చిత్రంలో వీరి ముగ్గరి కాంబినేషన్‌లో పాట లేనందునే దీన్ని రూపొందించినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.


తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది. మొదట్లో కాంచన-2గా వస్తోందని అన్నారు. కానీ, గంగ పేరుతో రూపొందిన టీజర్ భయపెడుతూ అందరినీ ఆకట్టుకుంది. వైవిధ్యవంతమైన కథ, కథనాలతో రూపొందుతోంది. మరి, ఈ గంగ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


ముని 3 అంటూ టైటిల్‌పై పెట్టి కాంచన-2 అంటూ సినిమాపేరు ఉంచారు. ఓ రకంగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న 3వ సీక్వెల్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు కలిగేలా చేశారు రాఘవ. పసుపుతో నిండిన ఫోటోలో భక్తుని రూపంలో చేతి నిండా గాయాలతో ఉంది ఫస్ట్‌లుక్ ఫోటో. ఇంకా ఈ చిత్రంలో తాప్సీ, నిత్యామీనన్‌లు నటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాదికి పైగా శ్రమించారు. కాంచన-2కు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.


కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఎన్నో హిట్ చిత్రాలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. తెలుగు, తమిళ చిత్రసీమల్లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ఆటాడించాడు. హీరో దర్శకుడిగా స్టెల్, ముని,కాంచన, సినిమాలతో విజయం అందుకున్నారు. దర్శకుడిగా నాగార్జునతో మాస్,డాన్ సినిమాలతో హిట్ కొట్టగా, యంగ్ రెబల్‌స్టార్‌తో చేసిన రెబల్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంచన-2తో మన ముందుకొస్తున్నారు. హరర్ కామెడీ చిత్రాలతో విజయాన్నందుకున్న రాఘవ కాంచన-2తో అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి.


రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

English summary
Finally Lawrence master’s “Ganga” (Kanchana 2) is hitting cinemas. Today, Bellamkonda confirmed that May 1st is going to be feast of those who love horror and thriller genres. He added that apart from Lawrence’s terrific direction and acts, glamour of Taapsee and Nitya Menon are going to be a big plus.
Please Wait while comments are loading...