మొదటి భీభత్సమైన క్రేజ్ ... ఫైనల్ గా ఫ్లాఫ్

By Srikanya

ముంబై : బాలీవుడ్ యంగ్ రణ్‌బీర్ కపూర్ నటించిన 'బేషరమ్' పై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి. అయితే ఆ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టిందని బాలీవుడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో తన తండ్రి రిషికపూర్ హీరోగా ఇదే పేరుతో వచ్చిన సినిమా సూపర్ హిట్ కావడంతో తనను కూడా అదృష్టం వరిస్తుందని రణ్‌బీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

దానికి తోడు ఆ మధ్య రణ్‌బీర్ నటించిన 'బర్ఫీ', 'యే జవానీ హై దివానీ' కలెక్షన్ల పరంగా దూసుకుపోవడంతో 'బేషరమ్'తో తనకు 'హ్యాట్రిక్' ఖాయమని రణ్‌బీర్ భావించినా, అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అభినవ్ సింగ్ కశ్యప్ దర్శకత్వంలో 'బేషరమ్' సంచలనం సృష్టిస్తుందన్న ఆశలు దారుణంగా పల్టీకొట్టడం రణ్‌బీర్‌కు అశనిపాతంలా తగిలింది.

గాంధీ జయంతి సందర్భంగా సెలవు రోజున విడుదలైనప్పటికీ ఈ సినిమాకు పెద్దగా 'ఓపెనింగ్స్' లేవని బాలీవుడ్ నిపుణులు పెదవి విరుస్తున్నారు. పోటీగా మరే సినిమాలు విడుదల కాకపోయినా 'బేషరమ్' ఏ విధమైన సత్తా చూపలేకపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా 'ఫ్లాప్' అయిందనే ప్రచారం వ్యాపించడంతో రెండో వారంలోనైనా కలెక్షన్లు పెరుగుతాయన్న ఆశలు పూర్తిగా అడుగంటాయి.

అయితే రణబీర్ కపూర్ డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సినిమాకు రూ. 15 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. రణబీర్ కపూర్ లేటెస్ట్ గా చేసిన అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో చేసిన 'బేషరామ్' చిత్రానికి రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడట. దీంతో పాటు 'రాయ్' అనే సినిమాకు కూడా కేమిట్ అయ్యాడు. 'రాయ్' చిత్రంలో రణబీర్ కపూర్ అర్జున్ రాంపాల్‌తో కలిసి నటిస్తున్నాడు. 'రాయ్' చిత్రానికి సోలో హీరో కాక పోయినా.....రెగ్యులర్‌గా తీసుకునే రూ. 15 కోట్లు చార్జ్ చేస్తున్నాడట రణబీర్. దీంతో పాటు ప్రాఫిట్స్‌లో షేర్ కూడా డిమాండ్ చేస్తున్నాడని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X