Don't Miss!
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sankranti Movies: అజిత్ vs విజయ్ మధ్యలో బాక్సాఫీస్ పోటీ.. అడ్వాన్స్ బుకింగ్స్ లో హోరాహోరీగా..
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వారి కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్న అగ్ర హీరోలు అజిత్ కుమార్, విజయ్. ఈ ఇద్దరికీ కూడా గత ఐదేళ్ల కాలంలో బాక్సాఫీస్ వద్ద మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా విజయ్ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం ఇద్దరి సినిమాల మధ్య అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. లేటెస్ట్ గా అందిన లెక్కల ప్రకారం ఏ హీరో అత్యధిక స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తో ముందంజలో ఉన్నాడు అనే వివరాల్లోకి...

చెన్నై నగరంలో..
రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ వివరాలలోకి వెళ్తే.. ముఖ్యంగా మొదటి రోజు ప్రధాన నగరంలో సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. వారిసు (వారసుడు) సినిమాను చెన్నైలో 67 లొకేషన్స్ లో 114 షోలతో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే 95% అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.
ఇక అజిత్ తునివు(తెగింపు) సినిమాను 63 లొకేషన్ లలో 112 షోలను ప్రదర్శించబోతుండగా దాదాపు 92 శాతానికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది.

బెంగుళూరు, కొచ్చిలో..
బెంగళూరులో వారిసు సినిమాను 63 లొకేషన్ లో 169 షోలతో రిలీజ్ చేస్తుండగా 31 శాతానికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇక అజిత్ తునివు సినిమాను 31 లొకేషన్లలో 85 షోలు ప్రదర్శిస్తుండగా 36 శాతానికి పైగా బుకింగ్స్ జరిగాయి. కొచ్చిలో అయితే వారిసు సినిమా 9 లొకేషన్ లలో 61 షోలకు గాను 29 శాతానికి పైగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక తునివు సినిమా మూడు లొకేషన్లో 37 షోలతో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకు 20 శాతానికి పైగా బుకింగ్స్ జరిగాయి.

తమిళ్ లో హోరాహోరీగా
తమిళనాడులో చూసుకుంటే వారిసు సినిమాకు ఇప్పటికే 533 షోలకు 71 శాతానికి పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. దీంతో 2.72 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అజిత్ సినిమాకు 527 షోలకు సంబంధించి 69 శాతానికి పైగా టికెట్లు అమ్ముడవ్వగా 2.73 కోట్లు వచ్చాయి. ఇద్దరిలో మధ్యలో ఓకే తరహా పోటీ అయితే కొనసాగుతోంది.

కర్ణాటక, కేరళలో..
కర్ణాటకలో విజయ్ సినిమాకు సంబంధించి 70 లోలేషన్స్ లో 232 షోలకు గాను 28% టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక అజిత్ సినిమాను 38 లొకేషన్స్ లలో 89 షోలని ప్రదర్శిస్తుండగా 37% టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్ముడయ్యాయి. కేరళలో చూసుకుంటే వారిసు సినిమాను 73 లోకేషన్లలో 626 షోలను ప్రదర్శిస్తున్నారు. దీంతో 26% బూకింగ్స్ జరిగాయి. ఇక అజిత్ తునివు సినిమా 18 లొకేషన్స్ లోని 310 షోలకు గాను 16 శాతంతో అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి.

యూఎస్ ప్రీమియర్స్
ఇక యూఎస్ ప్రీమియర్స్ షోలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే.. వారిసు సినిమా కంటే తునివు సినిమాకు ఎక్కువ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. వారిసు సినిమా 77 లోలేషన్స్ లలో 136 షోలకు ఇప్పటికే 57k డాలర్స్ ను అందుకుంది. ఇక తునివు సినిమా 109 లొకేషన్స్ లో 186 షోలకు గాను 67k డాలర్స్ ను నమోదు చేసుకుంది. మరి ఫైనల్ గా మొదటి రోజు ఎవరు ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటారో చూడాలి.