twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా డిజాస్టర్ టాక్... ఫేక్ కలెక్షన్లతో నిర్మాతలు ప్రేక్షకులను మాయ చేస్తున్నారా?

    |

    అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా బాలేదని మౌత్ టాక్ స్ప్రెడ్ అయినా కలెక్షన్లు మాత్రం అదిరిపోయే విధంగా ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది.

    'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రం తొలి రోజు రూ. 52 కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ట్రేడ్ విశ్లేషకులు ఇందులో నిజం లేదంటున్నారు. సినిమా మొత్తం రూ. 43 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిందని, అయితే నిర్మాతలు రూ. 9 కోట్లు యాడ్ చేసి బాలీవుడ్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా అనే ప్రచారం తెరపైకి తెచ్చారని, ఇదంతా పబ్లిసిటీ మాయే అంటున్నారు.

    ప్రేక్షకులను ఫూల్ చేయొద్దు

    బాలీవుడ్ వ్యాపార విశ్లేషకుడు రోహిత్ జైస్వాల్ ఈ విషయంలో నిర్మాతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మొదట సినిమా బడ్జెట్ గురించి మాయ మాటలు చెప్పారు. ఇపుడు కలెక్షన్ల విషయంలోనూ అలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు... ప్రేక్షకులను ఫూల్ చేయడానికి ఇది 90ల కాలం కాదు అంటూ ట్వీట్ చేశారు.

    ఇలాంటి వాటికి సపోర్ట్ చేయబోము

    ఇలాంటి వాటికి సపోర్ట్ చేయబోము

    మీ సినిమా తొలి రోజు అన్ని రికార్డులను బద్దలు కొట్టిందంటూ అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి వాటికి నేను సపోర్ట్ చేయను అంటూ రోహిత్ జైస్వాల్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    వాస్తవంగా ఎంత వసూలైందంటే?

    థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ రెండు రోజుల్లో మొత్తం రూ. 66 నుంచి 67 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు 50 శాతం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఓవరాల్‌గా సినిమా డిజాస్టర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు ఈ చిత్రం రూ. 23 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అయితే నిర్మాతలు మరో 15 కోట్లు అదనంగా ప్రకటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    అవును అవి ఫేక్ కలెక్షన్లే

    మరో ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ ట్విట్ చేస్తూ... నిర్మాతలు ఫేక్ కలెక్షన్లు ప్రకటిస్తున్న విషయం నిజమే అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలకు తాను ముందు నుంచీ వ్యతిరేకమే అంటూ వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు ప్రకటించిన ఫిగర్ రూ. 52 కోట్లు, ట్రేడ్ ఫిగర్ రూ. 42 నుంచి 43 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.

    ఇలాంటి అవసరం ఏమిటి?

    ఇలా ఫేక్ కలెక్షన్లు ప్రకటించాల్సిన అవసరం నిర్మాతలకు ఏమిటి? అంటే... ప్రేక్షకులను మానిప్యులేట్ చేసి సినిమా థియేటర్లకు వారిని రప్పించడమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్షన్లు బావున్నాయని ప్రచారం జరిగితే సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారని వారి ఉద్దేశ్యం.

    అమీర్ ఖాన్‌కు సంబంధం లేదు

    అయితే ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా విషయంలో జరుగుతున్న ఈ మానిప్యులేషన్లో అమీర్ ఖాన్‌కు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. ఇదంతా చిత్ర నిర్మాతలు ఆడుతున్న ఫేక్ కలెక్షన్ల నాటకమే అని తేల్చి చెబుతున్నారు.

    అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి

    అమీర్ ఖాన్ గత 15 ఏళ్లో మనకు ఎన్నో ఐకానిక్ చిత్రాలు అందించారు. కొన్ని సార్లు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి చెత్త సినిమాలు రావడం సహజమే. అయితే కలెక్షన్ల విషయంలో మానిప్యులేషన్ చేయడాన్ని నేను అసలు సమర్ధించను... అని సుమిత్ తెలిపారు.

    English summary
    "First they lied abt Budget Now Collections To be honest its not needed... we r not living in 90s you can fool audience not Trade and MOST IMPORTANT Your Film has Broken all Records, for Day 1, ... Den also increasing 15% total collection is not good, I dont support this (sic)." Bollywood trade observer Rohit Jaiswal tweeted about Thugs of Hindustan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X