»   »  ‘బ్రూస్ లీ' ఆడియో విడుదల తేదీ మారింది

‘బ్రూస్ లీ' ఆడియో విడుదల తేదీ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే .ఈ చిత్రం ఆడియో పంక్షన్ అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. మొదట సెప్టెంబర్ 26న విడుదల చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలా మారింది. భారీ ఎత్తున ఈ ఆడియో ఫంక్షన్ ని జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 16 చిత్రం విడుదల చేస్తున్నారు.

bruslee3

చిత్రం సంగీత దర్శకుడు తమన్ తాను ఆడియో పంక్షన్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలియచేసారు. ఆయన ట్వీట్ చేస్తూ...


చిత్రం విశేషాలకు వస్తే...

సినిమాలో చిరంజీవి పాత్రకు చెందిన సన్నివేశాలు ఈ నెలాఖరు నుంచి షూట్ చేస్తారు. అలాగే... ఈ సినిమాలో స్పెషల్ ఐటం సాంగు చేసేందుకు తమన్నాను ఎంపిక చేసినట్లు ,ఈ సాంగులో తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ తో స్టెప్పులేయనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ కేవలం రూమర్సే అని ట్విట్టర్ ద్వారా తమన్నా ఖండించింది. తమన్నా ఈ ట్వీట్ లో తనను బ్రూస్ లీ చిత్రం కోసం ఎవరూ సంప్రదించలేదని, అదంతా అబద్దమని తేల్చి చెప్పింది.

చిరంజీవి 15 నిముషాల పాటు కనిపించనున్నారు.. రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కొద్ది రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.

bruslee2

లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

నిర్మాతలు చెప్పేదాని ప్రకారం..."బ్రూస్ లీ ...ది ఫైటర్ చిత్రం అక్టబర్ 16న విడుదల అవుతుంది. అలాగే ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తారు !!" ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు.

bruslee audio

"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.


ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Director Srinu Vaitla's Bruce Lee starring Ram Charan and Rakul Preet Singh will have its audio launch on October 2nd on the eve of Gandhi Jayanthi. The event will be held in big way in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu