»   »  యూఎస్ఏలో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ పరిస్థితి ఏంటి?

యూఎస్ఏలో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ పరిస్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ సినీ కెరీర్లో ఇప్పటి వరకు అందని దాక్షగా ఉండిపోయిన ఫీట్ యూఎస్ఏలో తన సినిమా 1మిలియన్ డాలర్ మార్కు అందుకోవడం. ఇప్పటి వరకు రామ్ చరణ్ నటించిన ఏ సినిమా కూడా 1 మిలియన్ డాలర్ మార్కును అందుకోలేక పోయింది. ఈ సారి ఎలాగైన 1 మిలియన్ డాలర్ వసూళ్ల కబ్లబ్ లో చేరాలని ఉవ్విల్లూరుతున్న రామ్ చరణ్ తన తాజా సినిమాను ‘బ్రూస్ లీ'ని అమెరికాలో అత్యధిక స్క్రీన్లలో విడుదయ్యేలా ప్లాన్ చేసారు.

దాదాపు 212 లొకేషన్లలో బ్రూస్ లీ సినిమా యూఎస్ఏ వ్యాప్తంగా విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకుడు కావడం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఉండటంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి. తొలి రోజు ఈ చిత్రం అక్కడ ప్రీమియర్ షోలతో కలిపి 285000 డాలర్లు వసూలు చేసింది.


 Bruce lee first day USA collections

బ్రూస్ లీ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ఈ సారి రామ్ చరణ్ 1 మిలియన్ మార్కు అందుకుంటాడని బలంగా నమ్ముతోంది. వీకెండ్ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమా అక్కడ ఏ మేరకు వసూలు చేస్తుందనే దానిపై ఓ క్లారిటీ రానుంది.


రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు.


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Bruce lee got a tremendous positive talk and has opened up with about 285K with premieres only in USA.
Please Wait while comments are loading...