twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామేన్ గంగతో..' వైజాగ్ కొత్త రికార్డ్?

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మునెపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం వైజాగ్ ఏరియా నాలుగు కోట్ల పది లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఈ రేట్ పవన్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

    పవన్ గత చిత్రం గబ్బర్ సింగ్ సూపర్ హిట్ ఎఫెక్టు ఈ సినిమా బిజినెస్ పై బాగా ప్రభావం చూపెడుతోంది. దేముడు చేసిన మనుష్యులు ఫెయిల్యూర్ కావటంతో ఈ సినిమా బిజినెస్ పై ఆ ఎఫెక్టు ఉంటుందని అంతా అంచనాలు వేసారు. అయితే వాటిని తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బిజినెస్ చేస్తోంది. అలాగే రాయలసీ,సీడెడ్ ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తున్నట్లు వినికిడి. తూర్పు గోదావరి జిల్లాకు రెండు కోట్ల యాభై లక్షల వరకూ ఆర్.ఆర్ ఫిలింస్ వారు ఆఫర్ చేస్తున్నట్లు వినికిడి. ఆల్రెడీ నైజాం ఏరియాని అల్లు అరవింద్ తీసుకన్నట్లు చెప్తున్నారు.

    'గబ్బర్‌ సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు .

    ఇదిలా ఉంటే... నిర్మాత డివివి దానయ్య యూఎస్, ఓవర్సీస్‌లో తానే స్వయంగా ఈ చిత్రాన్ని విడుదల చేసుకుంటానని ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Latest buzz is that pawan kalyan's 'Cameraman Gangatho Rambabu' movie's rights for Vizag area have been sold to a whopping price of Rs.4.10 crores. If this news is to be believed, this is an all time record for any movie so far in this area. Tamanna is doing opposite to pawan kalyan in this movie. Manisharma is composing the music of this film. Puri Jagannath is directing this movie while it is being producing by D.V.V.Danayya on Universal Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X