»   »  చివరకు 'చింతకాయిల రవి'

చివరకు 'చింతకాయిల రవి'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chintakayala Ravi
మొన్న గురువారం రిలీజైన 'చింతకాయిల రవి' యావరేజ్ టాక్ వద్ద సెటిలయినా కలెక్షన్స్ లో మాత్రం భారీగా ముందుకెళ్తున్నాడు. చూసిన ప్రతీ వారు అద్బుతం అనకపోయినా ఈ మధ్య కామన్ గా మారిన చెత్త అనే పదం వాడకపోవటం ప్లస్ గా మారింది. అందులోనూ రంజాన్,గాంధి జయింతి,శని,ఆదివారం సెలవులు మాత్రమే కాక దసరా ఫెస్టివల్ నిమిత్తం స్కూల్స్ ,కాలేజెస్ కీ సెలవలు ఇవ్వటం ఈ సినిమాకు కలెక్షన్ పరంగా కలిసివచ్చింది.

దాంతో ఫస్ట్ వీక్ షేర్ చాలా సంతృప్తిగా ఉందని బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్స్ సంతోషిస్తున్నారు. అలాగే షావా..షావా పాటలో ఎన్టీఆర్ కనపడింది కొద్ది సేపే అయినా ఎలా కనిపించాడని అతని అభిమానులు భారీ ఎత్తున ధియోటర్స్ కి తరలి వస్తున్నారు. అలాగే ఆ పాట వచ్చేటప్పుడు భారీ ఎత్తున హర్షద్వానాలు చేయటం జరుగుతోంది. ఆ కోణంలోనూ చింతకాయల రవి యూనిట్ అనుసరించిన స్కీమ్ పారింది. అయితే ఇదే వేడీ ఈ సెలవులు అనంతరం కూడా కొనసాగితుందా అనేది తేలాల్సిన విషయం. అయినా చింతకాయిల రవి సేఫ్ అనేది ట్రేడ్ రిపోర్ట్.వెంకటేష్,అనూష్క,మమతామోహన్ దాస్ జంటగా యోగి రూపొందించిన ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X