twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు 150: ప్రీ-రిలీజ్ బిజినెస్ షురూ, చిరు స్టామినా ఎంతో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాకు విడుదల ముందు ఎంత ఓవర్ గా పబ్లిసిటీ జరిగిందో తెలిసిందే. అసలు రజనీకాంత్ సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. దీనికి తోడు పబ్లిసిటీ కూడా మరీ ఓవర్ కావడంతో ప్రేక్షకుల్లోనూ అంచనాలు అదే రేంజిలో పెరిగాయి. చివరకు సినిమా అంచనాలను అందుకోక పోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు.

    రజనీకాంత్‌కు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో... తెలుగులో చిరంజీవికి అంతే ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన వివి వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న 150వ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    అయితే సినిమా పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ట్రేడ్ పండితులు. కబాలి తరహాలో ఓవర్ పబ్లిసిటీ మాత్రం కావొద్దంటున్నారు. అలా చేయడం వల్ల సినిమాపై అనవసర అంచనాలు కల్పించినట్లు అవుతుందని అంటున్నారు.

    చిరంజీవి సినిమా కాబట్టి, మెగా అభిమాన బలం భారీగా ఉంది కాబట్టి ఈ సినిమా బిజినెస్ హై ఎస్టిమేషన్స్ తో జరుగుతోంది. (స్లైడ్ షోలో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ విశేషాలు)

    ప్రీ రిలీజ్

    ప్రీ రిలీజ్

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైనట్లు తెలుస్తోంది. సీడెడ్, ఈస్ట్ గోదావరి ఏరియాలకు సంబంధించిన డీల్స్ ఓకే అయినట్లు సమాచారం.

    వైజాగ్ రేసులో..

    వైజాగ్ రేసులో..

    వైజాగ్ ఏరియా రేసులో రెండు పార్టీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరు ఎక్కువ చెల్లించి రైట్స్ దక్కించుకుంటారనేది తేలాల్సి ఉంది.

    ఎన్వీ ప్రసాద్

    ఎన్వీ ప్రసాద్

    చిరంజీవి ఫ్యామిలీకి చాలా క్లోజ్ గా ఉండే ఎన్వి ప్రసాద్ చిరంజీవి 150వ సినిమా రైట్స్ తో పాటు రామ్ చరణ్ ధ్రువ మూవీ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారట.

    అనుశ్రీ ఫిల్మ్స్

    అనుశ్రీ ఫిల్మ్స్

    ఈస్ట్ గోదావరి ఏరియాకు సంబంధించిన రైట్స్ అనుశ్రీ ఫిల్మ్స్ వారు రూ. 5.5 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

    రూ. 7.2 కోట్లు అంచనా..

    రూ. 7.2 కోట్లు అంచనా..

    వైజాగ్ ఏరియాకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. చివరకు రూ. 7.2 కోట్ల ఎవరో ఒకరు దక్కించుకునే అవకాశం ఉంది.

    రూ. 70 కోట్లు అంచనా..

    రూ. 70 కోట్లు అంచనా..

    అన్ని ఏరియాలు కలిపి చిరంజీవి 150వ సినిమా దాదాపు రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

     రామ్ చరణ్

    రామ్ చరణ్

    రామ్ చరణ్ స్వయంగా ఈ చిత్రానికి నిర్మాత కావడంతో రేపు ఏదైనా జరిగినా ఆయనే బాధ్యత తీసుకుంటాడనే నమ్మకంతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ రేటు పెట్టేందుకైనా వెనకాడట లేదు.

    సంక్రాంతి రిలీజ్

    సంక్రాంతి రిలీజ్

    ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Chiru150 theatrical rights business has begun. While deal is done for Ceded and East Godavari areas, two parties are in race for Vizag rights. As per reliable sources, discussions are on for rights of other areas too. Kathilantodu is estimated to make around Rs 70 Cr business.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X