twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Official Collections: చిరంజీవికి 92 కోట్ల టార్గెట్.. వారంలో అన్ని కోట్లే.. F3 కంటే దారుణం

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన మరింత వేగంగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' అనే చిత్రంతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఇంకెత రాబట్టాల్సి ఉంది? అనేవి చూద్దాం పదండి!

    గాడ్ ఫాదర్‌గా చిరంజీవి ఎంటర్

    గాడ్ ఫాదర్‌గా చిరంజీవి ఎంటర్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా రూపొందించిన చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా తెరకెక్కింది.

    జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    గాడ్ ఫాదర్ బిజినెస్ వివారాలివే

    క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి రూ. 91 కోట్ల బిజినెస్ అయింది.

    7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    7వ రోజు 'గాడ్ ఫాదర్'కు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 83 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

    వారం రోజులకు ఎంతొచ్చింది?

    వారం రోజులకు ఎంతొచ్చింది?

    'గాడ్ ఫాదర్'కు వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.04 కోట్లు, గుంటూరులో రూ. 3.70 కోట్లు, కృష్ణాలో రూ. 2.44 కోట్లు, నెల్లూరులో రూ. 1.87 కోట్లతో కలిపి రూ. 39.30 కోట్లు షేర్, రూ. 64.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    వారం రోజుల్లో ఆంధ్రా తెలంగాణలో రూ. 39.30 కోట్లు రాబట్టిన చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటకలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 53.10 కోట్లు షేర్‌, రూ. 96.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గాడ్ ఫాదర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 91 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 92 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 53.10 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 38.90 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    ఆరో రోజే డౌన్.. F3 కంటే దారుణం

    ఆరో రోజే డౌన్.. F3 కంటే దారుణం

    మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రానికి ఏదో రోజు మాత్రం కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కోటి కంటే తక్కువ మొత్తం వచ్చింది. ఫలితంగా వరుసగా ఎక్కువ రోజులు కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' పరిస్థితి దారుణంగా ఉంది. ఇది కేవలం 6 రోజులే కోటి రాబట్టగా.. F3 మూవీ 7 రోజులు ఈ ఫీట్ సాధించింది.

    English summary
    Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. This Movie Collect 53.10 Cr in 1st Week
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X