Don't Miss!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- News
అందుకే జగన్‌తో స్నేహం: మంచి చేస్తానో లేదో తెలియదు కానీ..: పోసాని
- Finance
adani: అదానీకి కొత్త సమస్య.. దాని ధర తగ్గించాలని పట్టుబడుతున్న బంగ్లాదేశ్
- Sports
Ranji Trophy 2023: ముగిసిన ఆంధ్ర పోరాటం.. క్వార్టర్స్‌లో తప్పని ఓటమి!
- Lifestyle
గర్భిణీ స్త్రీలు నిద్రలేమితో బాధపడటానికి కారణాలు ఏమిటో తెలుసా?
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya 11 Days Collections: తగ్గిన చిరంజీవి దూకుడు.. అక్కడ అసలుకే రాని వసూళ్లు, వచ్చింది ఎంతంటే!
సుమారు 22 ఏళ్ల తర్వాత అన్నదమ్ములుగా మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం యాక్షన్ అండ్ కామెడీ మూవీగా మంచి విజయం సాధించింది.
కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుతూ సంక్రాంతి విన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు వాల్తేరు వీరయ్య. బాక్సాఫీస్ వద్ద కూడా పూనకాలు సృష్టిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 114.13 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో 11వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం!

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
వాల్తేరు వీరయ్య చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఏపీ, తెలంగాణలో కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో మొత్తంగా రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటకలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9 కోట్లతో మొత్తంగా రూ. 88 కోట్లు నమోదు అయింది. ఇలా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదు అయింది.

11వ రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
ముద్దుగుమ్మలు శ్రుతి హాసన్, కేథరీన్ ట్రేసా హీరోయిన్స్ గా అలరించిన వాల్తేరు వీరయ్య తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ వివరాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 29 శాతం, బెంగళూరులో 26.50 శాతం, చెన్నైలో 24.50 శాతం, విజయవాడలో 11.50 శాతం, వరంగల్‌లో 35 శాతం, గుంటూరులో 28.50 శాతం, వైజాగ్‌లో 34 శాతం, నిజమాబాద్‌లో 2.50 శాతం, కరీంనగర్‌లో 4 శాతం, కాకినాడలో 22.50 శాతం, నెల్లూరులో 19 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

11వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వాల్తేరు వీరయ్య సినిమా హిందీ వెర్షన్ తెలుగు వెర్షన్ తో పోలీస్తే చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 15 శాతం, కోల్‌కతాలో 14 శాతం, ఆహ్మదాబాద్ 1 శాతం, సూరత్‌లో 17.50 శాతం, భోపాల్ లో 76 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చూపించాయి. ముంబై, పూణే, బెంగళూరు, జైపూర్, కాన్పూర్, నాగ్ పూర్ వంటి తదితర ప్రాంతాల్లో అసలుకే నమోదు కాలేదు. ఇక మార్నింగ్ షోలు 11.73 శాతం, మధ్యాహ్నం 10.83 శాతంగా నమోదు అయ్యాయి.

11వ రోజు ఎంతొచ్చిందంటే..
మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు ముందుగానే మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాగా అలాగే కంటిన్యూ అవుతూ ఇప్పటిదాకా దూసుకుపోతోంది. అయితే 11వ రోజు సోమవారం కావడంతో కలెక్షన్లు కాస్తా తగ్గినట్లు తెలుస్తోంది. వింటేజ్ లుక్ లో చిరంజీవి అదరగొట్టిన వాల్తేరు వీరయ్య సినిమా 11వ రోజు రూ. 4.35 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

11 రోజుల్లో వచ్చింది ఎంతంటే?
మాస్ మహారాజా పోలీస్ ఆఫీసర్ గా.. మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ గా అదరగొట్టిన వాల్తేరు వీరయ్యా సినిమాను చిరు వీరాభిమాని కేఎస్ రవీంద్ర తెరకెక్కించారు. ఫలితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకు మొత్తం 11 రోజులకు కలిపి రూ. 145.80 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. అయితే వాల్తేరు వీరయ్యకు 11 రోజుల్లో రూ. 118.48 నుంచి 120 కోట్ల షేర్ కలెక్షన్స్ రావొచ్చని మరొక సర్వే తెలుపుతోంది.