Don't Miss!
- News
ఎట్టకేలకు కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కు విముక్తి- 28 నెలల తర్వాత జైలు నుంచి బయటకు..
- Lifestyle
Chanakya Niti: మహిళలు ఈ విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Citi Group: అదానీకి మరిన్ని కష్టాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సిటీ గ్రూప్.. ఢమాల్..
- Technology
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- Sports
INDvsNZ : జట్టులో వేస్ట్ అన్న వాళ్లకు.. సెంచరీతో బదులిచ్చిన గిల్.. ఏమన్నాడంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya Day 4 Collections: కొనసాగుతోన్న చిరు మేనియా.. కానీ, నాలుగో రోజు వసూళ్లు ఇలా!
మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా అభిమానులు, ప్రేక్షకుల్లో పూనకాలు సృష్టిస్తోంది.
సినిమాకు క్రిటిక్స్ పరంగా ఎలాంటి టాక్ ఉన్న అభిమానులు, సగటు తెలుగు ప్రేక్షకుడికి మాత్రం వాల్తేరు వీరయ్య సూపర్ ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. దీంతో వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో వాల్తేరు వీరయ్యగా చిరు సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 108 కోట్ల గ్రాస్ కలెక్ట్ కాగా 4వ రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
చాలా కాలం తర్వాత మాస్ మసాల సినిమాతో అదరగొట్టారు చిరంజీవి. వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్న చిరు లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య తెలుగు, హిందీ వెర్షన్ లలో విడుదలైంది. దీంతో ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.
ఏపీ, తెలంగాణలో కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో మొత్తంగా రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాలుగో రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
శ్రుతి హాసన్, కేథరీన్ ట్రేసా హీరోయిన్స్ గా ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ వివరాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 59 శాతం, బెంగళూరులో 28 శాతం, చెన్నైలో 58.50 శాతం, విజయవాడలో 83 శాతం, వరంగల్‌లో 47 శాతం, గుంటూరులో 87 శాతం, వైజాగ్‌లో 94 శాతం, నిజమాబాద్‌లో 34 శాతం, కరీంనగర్‌లో 77 శాతం, కాకినాడలో 96.50 శాతం, నెల్లూరులో 94.50 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

4వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..
చిరంజీవి-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిందీ వెర్షన్ తెలుగు వెర్షన్ తో పోలీస్తే చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ముంబైలో 4 శాతం, ఢిల్లీలో 11.50 శాతం, పూణె 10 శాతం, కోల్‌కతాలో 23.50 శాతం, ఆహ్మదాబాద్ 2 శాతం, సూరత్‌లో 5.50, జైపూర్ 20 శాతం, కాన్పూర్ లో 1 శాతం, వడోదర 2 శాతం రాగా, భోపాల్ లో 21.50 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చూపించాయి.

నాలుగో రోజు కలెక్షన్స్..
మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు ముందుగానే మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాగా అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే నాలుగో రోజు సోమవారం కారణంగా కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా నాలుగో రోజు రూ. 15 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నాలుగు రోజుల్లో వచ్చేది..
చిరంజీవికి వీరాభిమాని అయిన కేఎస్ రవీంద్ర తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ క్యారెక్టర్ హైలెట్ గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫలితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకు మొత్తం నాలుగు రోజులు కలిపి రూ. 85.20 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

మూడు రోజుల వసూళ్లు..
చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 47.46 కోట్ల షేర్, రూ. 76.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 3 డేస్ లో రూ. 58.91 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక గ్రాస్ కలెక్షన్స్ అయితే రూ. 108.95 కోట్ల వసూళ్లు రాబట్టింది.
దీంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి సెంచరీ కొట్టి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మరి నాలుగో రోజు సోమవారం కారణంగా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.