twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya Collections: చిరు బాక్సాఫీస్ కుమ్ముడు.. కొద్దిలో టార్గెట్ మిస్, 150 కోట్ల క్లబ్ లో చేరాలంటే!

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ మొదటిసారిగా నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే స్టోరీ ఎలా ఉన్నా ఎంగేజింగ్ గా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇందులో మరోసారి తనదైన కామెడీతో చిరు అలరించాడని టాక్. సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన వాల్తేరు వీరయ్య 5వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దామా!

    కీలక పాత్రల్లో స్టార్ క్యాస్ట్..

    కీలక పాత్రల్లో స్టార్ క్యాస్ట్..

    టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిత్రమే వాల్తేరు వీరయ్య. ఇందులో మరోక కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ అలరించాడని ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ఏర్పడింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, కేథరీన్ ట్రేసాలు హీరోయిన్లు కాగా.. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్..

    తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్..

    చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ లో అదరగొట్టిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తెలుగుతోపాటు హిందీ వెర్షన్ లో విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలుపుకుని నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.2 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ. 6 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ. 7.50 కోట్లు, కృష్ణా రూ. 5.6 కోట్లు, నెల్లూరు రూ. 3.2 కోట్లతో మొత్తంగా రూ. 72 కోట్లు వాల్తేరు వీరయ్యకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

    అన్నయ్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రానికి ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 2 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. కర్ణాటకలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9 కోట్లుగా తేలింది. దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది వాల్తేరు వీరయ్య చిత్రం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

    తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కలెక్షన్స్..

    తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కలెక్షన్స్..

    చిరంజీవి-శ్రుతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఆంధ్రా, తెలంగాణలో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఫలితంగా నైజాంలో రూ. 2.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 64 లక్షలు, కృష్ణాలో రూ. 86 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో కలిపి రూ. 8.80 కోట్లు షేర్, రూ. 14.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల వసూళ్లు..

    తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల వసూళ్లు..

    బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 రోజుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో 5 రోజుల్లో నైజాంలో రూ. 22.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.64 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.81 కోట్లు, గుంటూరులో రూ. 5.45 కోట్లు, కృష్ణాలో రూ. 4.98 కోట్లు, నెల్లూరులో రూ. 2.54 కోట్లతో కలుపుకుని రూ. 67.68 కోట్లు షేర్, రూ. 107.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    వరల్డ్ వైడ్ గా ఎంతొచ్చిదంటే..

    వరల్డ్ వైడ్ గా ఎంతొచ్చిదంటే..

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 67.68 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రపంచవ్యాప్తంగానూ సత్తా చాటింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే విడుదలైన ఐదు రోజుల్లో మెగాస్టార్ నటించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 83.53 కోట్లు షేర్‌, రూ. 144.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇంకొక రూ. 6 కోట్లు వస్తే రూ. 150 కోట్ల క్లబ్ లో చేరనుంది వాల్తేరు వీరయ్య. దీంతో ఈ టార్గెట్ కు కొద్దిలో మిస్ అయినట్లు తెలుస్తోంది.

     ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    మెగాస్టార్ చిరంజీవి-బాబీ-రవితేజ వంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. అయితే వాల్తేరు వీరయ్య సినిమా 5 రోజుల్లో రూ. 83.53 కోట్లు సాధించింది. అంటే మరో రూ. 5.47 కోట్లు రాబడితేనే చిరంజీవి సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

    English summary
    Chiranjeevi Ravi Teja And Director KS Ravindra Combination Movie Waltair Veerayya 5 Days Worldwide Box Office Collection Is Rs 144.15 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X