twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా 17వ రోజు కలెక్షన్లు.. లాభం రావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలంటే..

    |

    Recommended Video

    Sye Raa Day 17 Box Office Collections || లాభాల్లోకి వచ్చిందా లేదా?

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్న సైరా నర్సింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని సాధిస్తున్నది. ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తూ నాలుగోవారంలోకి అడుగుపెడుతున్నది. అయితే ఈ సినిమా వసూళ్లు అంచనాలకు మించకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేస్తున్నది. గత 17 రోజుల్లో సైరా సాధించిన వసూళ్లు ఇవే...

    17వ రోజున వసూళ్లు

    17వ రోజున వసూళ్లు

    ఇక సైరా చిత్రం 17వ రోజున ఏపీ, తెలంగాణలో ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.7 లక్షలు షేర్, సీడెడ్‌లో రూ.5 లక్షల షేర్, ఉత్తరాంధ్రలో రూ.7 లక్షల షేర్, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2 లక్షల షేర్, పశ్చి గోదావరి జిల్లాలో రూ.1.6 లక్షలు, క‌‌ృష్ణా జిల్లాలో రూ.1.7 లక్షలు, నెల్లూరులో రూ.1.1 లక్షల షేర్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    17 రోజుల కలెక్ష్లన్లు

    17 రోజుల కలెక్ష్లన్లు

    సైరా చిత్రానికి సంబంధించి గత 17 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో సుమారు రూ.32 కోట్లు, సీడెడ్‌లో రూ.18.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.16.04 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.9.33 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.7.03 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.9.48 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7.34 కోట్లు, నెల్లూరు రూ.4.25 కోట్లు రాబట్టింది.

     ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

    ఆర్టీసీ క్రాస్ రోడ్డులో

    ఇక సినీ రాజధాని హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సైరా చిత్రం కొత్త రికార్డును నెలకొల్పింది. 2019లో రిలీజైన చిత్రాల్లో మహర్షి రూ.1,61,57,901/, సాహో రూ.1,42,39,700/, F2 చిత్రం రూ. 1,30,03,528, సైరా రూ.1,13,46,508 ఇస్మార్ట్ శంకర్ 90,57,705 సాధించింది. సైరా ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం.

    తెలుగేతర రాష్ట్రాల్లో..

    తెలుగేతర రాష్ట్రాల్లో..

    ఇక తెలుగేతర రాష్ట్రాల్లో సైరా అంతగా ప్రభావం చూపలేకపోయిందనే విషయం వసూలైన కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో రూ.14 కోట్ల వరకు, తమిళనాడులో రూ.1.35 కోట్లు, కేరళలో రూ.72 లక్షలు, హిందీలో రూ.5.5 కోట్ల మేరకు వసూలు కాగా, అమెరికా, కెనడాలో రూ.9 కోట్లకుపైగా, మిగితా దేశాల్లో రూ.4 కోట్లు వసూలు చేసింది.

    100 కోట్ల క్లబ్‌లో చేరి

    100 కోట్ల క్లబ్‌లో చేరి

    తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రభంజనం కొనసాగుతున్నది. గత 15 రోజుల్లో రూ.100 క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత అదే ఊపును కొనసాగిసిస్తూ ముందుకెళ్తున్నది. ఆంధ్ర ప్రదేశ్, నైజాంలో రూ.104 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ రూ.133 కోట్ల షేర్‌ను సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.140 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.50 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంటుంది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is released on october 2. On first day first show this movie got positive talk. So this movie gets huge collections worldwide. After 17th day, This movie got 140 crores share worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X