Stalin Re Release: స్టాలిన్ రీ రీలీజ్ గ్రాండ్‌గా.. 16 కోట్ల బడ్జెట్.. చిరంజీవి మూవీకి ఎంత లాభమంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్, పొలిటికల్ డ్రామా చిత్రం స్టాలిన్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, కుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్, శారద, ప్రదీప్ రావత్, బ్రహ్మనందం తదితరులు నటించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు నిర్మించారు. 2006 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన రిలీజైంది. చిరంజీవి కెరీర్‌లో భారీ విజయం అందుకొన్న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా గురించి విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే..
చిరంజీవి జీవితంలోని కొన్ని విషయాలను స్పూర్తి పొంది కథగా అల్లిన ఈ చిత్రం సోషల్ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాకు చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా.. ఆంథోని ఎడిటర్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి 16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో 28 కోట్ల రూపాయల షేర్ డిస్టిబ్యూటర్లకు సంపాదించి పెట్టింది.

ఈ సినిమాను తమిళంలో స్టాలిన్ పేరుతో, హిందీలో జై హింద్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో హై రేంజ్ రెస్పాన్స్ రాగా, తమిళం, హిందీలో అంతగా గొప్ప స్పందన కనిపించలేదు. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన పాటలకు విశేషంగా ఆదరణ లభించింది. పలు పాటలు ఇప్పటికీ హిట్‌గా మారి.. సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.
ఇదిలా ఉండగా, తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నది. ఇప్పటికే పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు సినిమాలు రీ రిలీజ్ అయి సంచలన విజయం సాధించాయి. ఇక చిరంజీవి తన 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ జనరేషన్ అభిరుచికి తగినట్టుగా ఈ మూవీని తిర్చి దిద్దారు. లేటేస్ట్ 4K టెక్నాలజీ, కలర్ గ్రేడింగ్, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో ప్రజెంట్ ఆడియెన్స్ కోరుకొనే విధంగా తీర్చి దిద్ది రిలీజ్‌కు ముస్తాబు చేశారు.
స్టాలిన్ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను బుక్ మై షోలో ఓపెన్ చేశారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులు మరోసారి చిరు బర్త్ డే సంబరాలను ఘనంగా జరుపుకొని పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, యూఎస్‌లో కొన్ని ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











