»   »  షాకింగ్ న్యూస్ : ‘బాహుబలి-2’ రిలీజ్ కోసం ఒక్కో ధియోటర్ కు కోటి ఖర్చు

షాకింగ్ న్యూస్ : ‘బాహుబలి-2’ రిలీజ్ కోసం ఒక్కో ధియోటర్ కు కోటి ఖర్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైద్రాబాద్: 2015లో విడుదలైన 'బాహుబలి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న 'బాహుబలి- ది కంక్లూజన్‌' ఈ ఏడాది ప్రథమార్థంలోనే, ఏప్రియల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ షాక్ ఇస్తోంది.

అదేమిటంటే...4కె రిజల్యూషన్‌తో కూడిన ప్రొజెక్టర్స్‌తో బాహుబలి 2 సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2వందల థియేటర్లు బాహుబలి2 కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. అయితే ఇప్పుడున్న ప్రొజెక్టర్స్ 4కె టెక్నాలజీ ప్రొజెక్టర్స్‌గా మారాలంటే సామాన్యమైన విషయం కాదు. దాదాపు ఒక్కో థియేటర్‌కు కోటి రూపాయల ఖర్చవుతుంది.


అందుకు కారణం..బాహుబలిలో కంటే బాహుబలి2 సినిమాలో గ్రాఫిక్స్‌కు, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బాహుబలి2ను విజువల్‌పరంగా ఎంత ఘనంగా తెరకెక్కించినా.. థియేటర్లలో ప్రొజెక్టర్స్‌ కూడా అంతే ఘనంగా చూపించగలగాలి.అప్పుడే విజువల్స్ అనుభూతిని ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఆస్వాదించగలుగుతాడు. ఇందు కోసం ఈ సినిమా విడుదలయ్యే థియేటర్లలో కొన్నింటికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు.


Cinema theatres gear up for Baahubali-2 with 4K projectors

అయితే కొందరు ధియోటర్ ఓనర్స్ నసుగుతున్నా... ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఈ ఖర్చుకు కూడా థియేటర్ యాజమాన్యాలు వెనుకాడటం లేదట. అయితే ఇవి కేవలం ఏషియన్ సినిమాస్, ఐమాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రమే. కొందరు మాత్రం 4కె ప్రొజెక్టర్స్ అద్దెకు తెచ్చుకుని ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.


థియేటర్ యాజమాన్యాలు బాహుబలి 2పై ఇంత నమ్మకం పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాను కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో 4కె స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ ఒక్క థియేటర్‌లో ఈ టెక్నాలజీ సాయంతో సినిమా ప్రదర్శించడం వల్ల 3.50 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. అదీ సంగతి.


మరో ప్రక్క ఇప్పటివరకూ ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాలేదు. జనవరి నెలలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ ని వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ రిలీజ్ పంక్షన్ ని భారి ఎత్తున చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రైలర్ కట్ లో యూనిట్ బిజిగా ఉంది.

English summary
Cinema theatres in the state are converting to 4K for the release of ‘Baahubali-2’ in April. Technological advancement in theatres is needed to attract the public, who are glued to TV channels, to theatres. The 4K projector is the latest fad in the film industry and around 200 cinema theatres across the country are likely to have 4K projectors before April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu