»   » పరీక్షలు, ఐపిఎల్ తో సినిమాకు పరీక్ష(ట్రేడ్‌టాక్)

పరీక్షలు, ఐపిఎల్ తో సినిమాకు పరీక్ష(ట్రేడ్‌టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రిందటి వారం డబ్బింగ్, స్ట్రైయిట్ కలిపి ఐదు చిత్రాలు రిలీజయ్యాయి. అయితే ఏదీ చెప్పుకోదగిన రీతిలో ఫలితం నమోదు చేయలేకపోయింది. వాటి వివరాలు...హీరో శివాజీ నిర్మాతగా మారి నిర్మించిన 'తాజ్‌మహల్", నవదీప్, భూమికల 'యాగం", రిషి 'దమ్మున్నోడు", ఉపేంద్ర, దీపికాపడుకొనే కన్నడ అనువాదం 'కంత్రీమొగుడు", హిందీ డబ్బింగ్ 'శాపం" విడుదలయ్యాయి.వీటిల్లో శివాజీ 'తాజ్‌మహల్" ఓకే అనిపించుకుంది. యాగం, దమ్మున్నోడు ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి. డబ్బింగ్ చిత్రాలు కంత్రీ మొగడు గతంలో నాగార్జున తో వచ్చిన మన్మధుడుకి కాపీ కావటంతో చూసిన వారు షాకవతున్నారు. దీపికా పడుకోని అందాలు కూడా ఈ చిత్రానికి కలిసి రాలేదు. ఇక విక్రమ్ భట్ దర్శకత్వలో వచ్చిన హిందీ డబ్బింగ్ హర్రర్ 'శాపం" గురించి మాట్లాడుకునేవారు కరువయ్యారు. మొత్తం మీద ఏ చిత్రానికి చెప్పుకోదగిన రీతిలో కలెక్షన్స్ లేవు. వీటి సంగతి ఇలా ఉంచితే..గత వారం విడుదలైన ఆకాశరామన్న, ప్రేమ్ ‌రాజ్యం, టిక్..టిక్..టిక్, దాసన్నా ధియోటర్స్ ని దాటిపోయాయి. వీటికి తోడు రాష్ట్రంలో పరీక్షల కాలం అవడంతోకూడా ధియోటర్స్ పై ఎఫెక్టు పడింది. అలాగే ఐపిఎల్ క్రికెట్ కూడా ఎఫెక్టు గట్టిగానే చూపిస్తోంది. దాంతో సినిమాల కలెక్షన్లు చాలా డల్‌గా వున్నాయి. ఇక నిన్న రిలీజైన వరుణ్ సందేశ్, అనితల మరో చరిత్ర రీమేక్ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu