»   »  700 కోట్లు వచ్చేసాయి: భారీ రికార్డు దిశగా ‘దంగల్’

700 కోట్లు వచ్చేసాయి: భారీ రికార్డు దిశగా ‘దంగల్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'దంగల్' ఇండియన్ సినీ చరిత్రలో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసే దిశగా దూసుకెలుతోంది. ఇపుడు చిత్రం రూ. 700 కోట్ల క్లబ్ లో ఎంటరైంది. డిసెంబర్ 23న రిలీజైన ఈ చిత్రం మూడు వారాలు గడిచిన తర్వాత కూడా మంచి వసూల్లు రాబడుతోంది.

బాక్సాఫీసు వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 23 రోజుల థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ రూ. 703.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 512.21 కోట్ల గ్రాస్ వసూల లవ్వగా, ఓవర్సీస్ బాక్సాఫీసు ద్వారా రూ. 190.94 కోట్ల గ్రాస్ వసూలయింది.

ఇండియన్ బాక్సాఫీసు వద్ద వసూలైన రూ. 521.21 కోట్ల గ్రాస్ లో....... రూ. 365.87 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇండియన్ బాక్సాఫీసు చరిత్రలో 'పికె' సినిమా తర్వాత రూ. 700 కోట్లు దాటిన సినిమా 'దంగల్' మాత్రమే.

 రూ. 800 కోట్లు త్వరలో

రూ. 800 కోట్లు త్వరలో

‘పికె' చిత్రం వరల్డ్ వైడ్ రూ. 740 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దంగల్ చిత్రం మరో రూ. 37 కోట్లు రాబడితే ‘పికె' రికార్డు బద్దలవుతుంది. ఫుల్ రన్ లో ‘దంగల్' మూవీ రూ. 800 కోట్ల మార్కను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 వేల కోట్ల వసూళ్లు.... దేశంలో ఒకే ఒక్కడు, ఎవరా స్టార్ హీరో?

వేల కోట్ల వసూళ్లు.... దేశంలో ఒకే ఒక్కడు, ఎవరా స్టార్ హీరో?

లీవుడ్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ దూసుకెలుతున్నాడు. కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ సినిమాల రికార్డులు బద్దలు కొట్టడం మరే హీరోకు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అమీర్ ఖాన్ కు ఊహించని షాక్

అమీర్ ఖాన్ కు ఊహించని షాక్

అమీర్ ఖాన్ కు ఊహించని షాక్: అంత నీచమైన పని చేసానా? ఇంట్లో పెట్టి తాళం వేసానా? తేల్చుకుంటానంటున్నాడు... పూర్తి వివారల కోసంక్లిక్ చేయండి.

 అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్' మూవీ రివ్యూ)

అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్' మూవీ రివ్యూ)

అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్' మూవీ పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి.)

English summary
Aamir Khan's Dangal which released on December 23rd is still doing well at the box office even after the end of its 3 weeks run.The movie collected Rs 365.87 crores nett at the Indian box office and the gross amount is Rs 512.21 crores. On the other hand, the film minted Rs 190.94 crores from the overseas box office. The total 23 days worldwide collections of Dangal is Rs 703.15 crores gross.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu