»   » అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్’ మూవీ రివ్యూ)

అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్’ మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.5/5
హైదరాబాద్: తను ఏ పాత్ర చేసినా, ఏ సినిమా చేసినా పర్‌ఫెక్టుగా చేస్తారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. అందుకోసం ఎంత శ్రమించడానికైనా, ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు. గతంలో ఆయన చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. ఇలా మిస్టర్ పర్‌ఫెక్షనిస్టుగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తాజాగా 'దంగల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దంగల్ అంటే మల్లయుద్ధం అని అర్థం.

ప్రముఖ ఇండియన్ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవిత కథ ఆధారంగా 'దంగల్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. మహిళలు రెజ్లింగ్ క్రీడ వైపు రావడాన్ని అదోలా చూసే రోజుల్లో మహవీర్ సింగ్ ఫోగట్ తన ఇద్దరు కూతుళ్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్ లను దేశం గర్వించదగ్గ మహిళా రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దారు అనే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది.

మహవీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ నటించారు. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించారు. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను అమీర్ ఖాన్ ఏ మేరకు మెప్పించారు అనేది చూద్దాం....

కథ విషయానికొస్తే..

కథ విషయానికొస్తే..

మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌(ఆమిర్‌ఖాన్‌) హరియాణాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రెజ్లర్. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. తన కల నెరవేరక పోవడంతో తనకు పుట్టబోయే కుమారుల ద్వారా అయినా అది నిజం చేయాలని భావిస్తారు. అయితే ఆయన భార్య శోభా కౌర్‌(సాక్షి తన్వార్‌) నాలుగు సార్లు ఆడపిల్లలనే ప్రసవిస్తుంది. తన కల నిజం కాదని డీలా పడిపోయిన ఫోగట్... అనుకోకుండా ఓ రోజు స్కూల్‌లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్‌(ఫాతిమా), బబిత కుమారీ(సాన్యా మల్హోత్ర) బల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతారు. వారిని రెజ్లర్లుగా తీర్చిదిద్ది తన కలను నిజం చేసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం వారికి తానే స్వయంగా కఠోర శిక్షణ ఇస్తాడు. మరి మహవీర్ సింగ్ ఫోగట్ కల నెరవేరిందా? లేదా? అనేది అనేది తెరపై చూడాల్సిందే.

అమీర్ ఖాన్ పెర్ఫార్మెన్స్

అమీర్ ఖాన్ పెర్ఫార్మెన్స్

అమీర్ ఖాన్ మరోసారి మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు. యంగ్ రెజర్‌గా, మధ్య వయసు తండ్రి పాత్రలో జీవించాడు. రెండు పాత్రలకు అనుగుణంగా తన శరీరాన్ని మలచుకుని అదరగొట్టాడు. ఇందుకోసం అమీర్ ఖాన్ కొన్ని నెలల పాటు శ్రమించాడు. దేశానికి గోల్డ్ మెడల్ అందించాలనే పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు.

గీతా, బబితా

గీతా, బబితా

మహవీర్‌సింగ్‌ కూతుళ్లు గీతా ఫోగట్‌గా ఫాతిమా, బబితా కుమారీ పాత్రలో సాన్యా మల్హోత్ర మెప్పించారు. టీవీ నటి సాక్షి తన్వార్ ఇందులో అమీర్ ఖాన్ భార్య పాత్రలో కనిపించి తనదైన నటనతో మెప్పించారు.

దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

గతంలో 'చిల్లార్ పార్టీ','భూత్నాథ్ రిటర్న్స్' వంటి సినిమాలు తీసిన అనుభవం ఉన్న నితీష్ తివారీ.... దంగల్ మూవీ కథను, అందులోని భావోద్వేగాల ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అక్కడక్కడా కాస్త స్లోగా ఉన్నా ప్రేక్షకుడి ఆకట్టుకుంటుంది.

rn

సాంకేతిక విభాగాలు

ప్రీతమ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువలు ఇలా టెక్నికల్ విభాగ అంతా పర్ ఫెక్టుగా ఉంది.

rn

ఫైనల్‌గా

ఓవరాల్‌గా చెప్పాలంటే... సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అమీర్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, దేశం గర్వించేలా తన తన కూతుళ్లను తీర్చి దిద్దిన మహవీర్ సింగ్ ఫోగట్ కథ మాత్రమే కాదు... క్రీడలు, మహిళలు, సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా సినిమాలో ఉంది.

English summary
Dangal movie revie and rating. Dangal is an Indian Hindi-language biographical sports drama film directed by Nitesh Tiwari. It stars Aamir Khan as Mahavir Singh Phogat, who taught wrestling to his daughters Geeta Phogat and Babita Kumari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu