»   » సినిమా అంత గొప్పగా ఉంది కాబట్టే... 3 రోజుల్లో 100 కోట్లు!

సినిమా అంత గొప్పగా ఉంది కాబట్టే... 3 రోజుల్లో 100 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'దంగల్' మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కొనసాగుతున్న ఈ తరుణంలో సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్య పరుస్తోంది.

దంగల్ మూవీ 3వ రోజైన ఆదివారం 20% గోత్‌తో ఈ ఒక్కరోజే రూ. 42.35 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ సినీ చరిత్రలో విడుదలైన 3వ రోజు 40 కోట్లు వసూలు చేయడం ఇదే తొలిసారి. ఆదివారం కావడంతో పాటు క్రిస్‌మస్ ఫెస్టివల్ కావడం బాగా కలిసొచ్చింది. సినిమా తొలి మూడు రోజుల్లో దాదాపు రూ. 106.95 కోట్లు వసూలు చేసింది.

దంగల్ మూవీ ప్రముఖ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్, ఆయన ఇద్దరు కూతుళ్లు...మహిళ రెజ్లర్లు గీతా కుమారి ఫోగట్, బబిత కుమారి ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ డే రికార్డ్స్ అందుకోలేక పోయింది

ఫస్ట్ డే రికార్డ్స్ అందుకోలేక పోయింది

అయితే ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్' చిత్రం తొలి రోజు రికార్డును ‘దంగల్' అందుకోలేక పోయింది. ‘సుల్తాన్' తొలిరోజు రూ.33.34 కోట్లు వసూలు చేయగా, ‘దంగల్' రూ. 29.78 కోట్లు రాబట్టింది. దేశ వ్యాప్తంగా పాత కరెన్సీ రద్దు ఎఫెక్టు వల్లే రికార్డును అందుకోలేక పోయిందని భావిస్తున్నారు. ఈ చిత్రం శని, ఆది వారాల్లో వరుసగా రూ. 34.82 కోట్లు, రూ. 42.35 కోట్లు రాబట్టింది.

అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్’ మూవీ రివ్యూ)

అందరూ చూడాల్సిన మంచి సినిమా... (‘దంగల్’ మూవీ రివ్యూ)

తను ఏ పాత్ర చేసినా, ఏ సినిమా చేసినా పర్‌ఫెక్టుగా చేస్తారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. అందుకోసం ఎంత శ్రమించడానికైనా, ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడరు. గతంలో ఆయన చేసిన... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అది రాజమౌళి ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్, చిరులతో కూడా.. : అమీర్ ఖాన్

అది రాజమౌళి ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్, చిరులతో కూడా.. : అమీర్ ఖాన్

భవిష్యత్ లో అమీర్ ఖాన్ సినిమాకు దర్శకత్వం చేయాలనుందని తన మనసులో కోరికను రాజమౌళి ఇంతకుముందోసారి వెల్లడించారు.నేను హిందీ సినిమాలు ఎక్కువ...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

దంగల్ కోసం ఆమీర్ ఖాన్ పడ్డ కష్టం ఈ వీడియోలో

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తాజా చిత్రం దంగల్ కోసం ఆమీర్ ఖాన్ బాగానే కష్టపడ్డాడు. ఈ వీడియో చూస్తే మీరు విషయం అర్థమవుతుంది.

English summary
Aamir Khan's Christmas release 'Dangal,' which also stars Fatima Sana Shaikh, Sanya Malhotra and Sakshi Tanwar in lead roles, has received an overwhelming response at the box-office. The film has crossed the coveted Rs 100-crore mark in its first weekend itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu