For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్టీఆర్ ‘దమ్ము’ నైజాం రైట్స్ ఆయనకే

By Srikanya
|

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము మీదే అందరి దృష్టి ఉంది. అపజయం అంటూ ఎదరగని దర్శకుడు బోయపాటి శ్రీను,ఎన్టీఆర్ కాంబినేషన్ అనేసరికి మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది.దాంతో ఈ చిత్రం నైజాం రైట్స్ ని ఫ్యాన్సి రేటు ఇచ్చి దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటికే ప్రముఖ డిస్ట్ర్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్ ఈ చిత్రం కృష్ణా, గుంటారూ, నెల్లూరు రైట్స్ తీసుకన్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రీ చరణ్ ఫిల్మ్ వారు ఏడు కోట్లుని ఎన్ ఆర్ ఎ బేసిస్ లో తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఓవర్ సీస్ రైట్స్ ని దూకుడు చిత్రం తీసుకున్న ఫికస్ వారు రెండు కోట్ల పది లక్షలు ఇచ్చి సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇక మిగతా ఏరియాలు కూడా మంచి రేటుతో బిజెనెస్ జరిగే అవకాసం ఉంది. ఇందుకోసం నిర్మాత కె ఎస్ రామారావు ఆఫీసులో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. ఊసరవెల్లి ఎఫెక్టు ఈ చిత్రం బిజెనెస్ పై అస్సలు పడకపోవటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి అక్కడ ఓ పెద్ద సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో మీసం ఉండనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగ సీజన్ కి విడుదల అయ్యేలా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా 'దమ్ము" ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రంలో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

English summary
Dil Raju has bagged ‘Dammu’ rights for Nizam area offering a whooping amount to film makers. This film is produced by KS Rama Rao and Boyapati Srinu will direct it. Shruti Hassan​ will play the female lead opposite Jr.NTR in the movie.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more