Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pogaru 4th day collections: మాస్ ఆడియెన్స్‌కు ధ్రువ్ సర్జా కనెక్ట్.. వసూళ్లు ఎలా ఉన్నాయంటే!
కన్నడ స్టార్ ధ్రువ సర్జా నటించిన డబ్బింగ్ మూవీ పొగరు చిత్రం అంచనాలకు మించిన వసూళ్లను సాధించింది. రిలీజ్‌కు ముందు చేసిన బిజినెస్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే అధిగమించే ప్రయత్నం చేస్తున్నది. ఈ గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..
పొగరు చిత్రం నాలుగో రోజున నైజాంలో 7 లక్షలు, సీడెడ్‌లో రూ.5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.3 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.1.2 లక్షలు, గుంటూరులో రూ.1.4 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 1.5 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్ష వసూలు చేసింది. మొత్తంగా నాలుగో రోజు ఈ చిత్రం 22 లక్షల నికర వసూళ్లను, రూ.40 లక్షల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

దీంతో పొగరుచిత్రం నాలుగు రోజుల్లో రూ.1.93 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. అంటే రూ.3.48 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 4 కోట్లు సాధించాలి. అంటే ఇంకా ఈ చిత్రం 2.07 కోట్లు రాబట్టాల్సి ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.