»   » మెగాస్టార్ రికార్డుకు సైలిష్ స్టార్ మంగళం.. డీజే కలెక్షన్ల హడావిడి..

మెగాస్టార్ రికార్డుకు సైలిష్ స్టార్ మంగళం.. డీజే కలెక్షన్ల హడావిడి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

డివైడ్ టాక్‌తో ప్రారంభమైన దువ్వాడ జగన్నాథం ప్రస్థానం ఇప్పడు బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకొన్నది అనే ప్రచారం జోరుగా సాగుతున్నది. డీజే కలెక్షన్లు నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తుడిచిపెడుతున్నదని దర్శకుడు హరీశ్ శంకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. డీజే థ్యాంక్యూ మీట్‌లో మా చిత్రమేంటో రెవెన్యూ మాత్రమే మాట్లాడుతుందని హరీశ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కలెక్షన్లు వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నాన్ బాహుబలి రికార్డులు మటాష్

నాన్ బాహుబలి రికార్డులు మటాష్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో రెండు నుంచి ఐదో స్థానంలో ఎక్కడ ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది అని హరీశ్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. డీజే దర్శకుడు చేసిన హడావిడి బట్టి చూస్తుంటే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బాహుబలి తర్వాత మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రందే ఓ రికార్డు. అయితే దర్శకుడు హరీశ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిరంజీవి రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయిందని అనుకోవాలనే అనుమానం తలెత్తుతున్నది.

ఐదు రోజుల కలెక్షన్లు

ఐదు రోజుల కలెక్షన్లు

చిరంజీవి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం 150 చిత్రం తొలి ఐదు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 46 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే దువ్వాడ చిత్రం తొలి నాలుగు రోజులకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.42.38 కోట్లు వసూలు చేసింది అని చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక ఐదో రోజుకు లెక్కవేస్తే సుమారు రూ.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మెగాస్టార్ చిత్రం వసూలు చేసిన రూ.46కోట్ల దాటేయడం ఖాయం.

ఖైదీ నంబర్ 150 రికార్డులు మంగళం..

ఖైదీ నంబర్ 150 రికార్డులు మంగళం..

డీజే సాధిస్తున్న కలెక్షన్లు బట్టి చూస్తే ఖైదీ నెం 150 కలెక్షన్లకు అల్లు అర్జున్ మంగళం పాడేసినట్టే అనుకోవాలి. ఈ చిత్రం వసూళ్లు నిజమైతే మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఓ చీలిక వచ్చే అవకాశం కనబడుతున్నది. గతంలో బన్నీ ఏ వేదిక మీదనైనా మెగాస్టార్ పేరు పలుకనిదే ఉండకపోయేవారు. ప్రస్తుతం మాట వరుసకు మెగా ఫ్యామిలీ అనే పదాన్ని పలుకుతున్నారు. ఇండస్ట్రీలో మహానటుడు అల్లు రామలింగయ్య లెజెండ్రీకి బీజం వేయాలనే సంకల్పం స్టైలిష్ స్టార్‌లో కనిపిస్తున్నది.

అల్లు లెజెండ్రీకి బీజం..

అల్లు లెజెండ్రీకి బీజం..

డీజే చిత్రంలో కూడా క్లైమాక్స్ సన్నివేశంలో మా తాత ఓ మాట చెప్పేవాడు అనే డైలాగ్‌ను అల్లు అర్జున్ చెప్పడం దానికి సంకేతామా అనే మాట వినిపిస్తున్నది. ప్రజారాజ్యం పార్టీ తర్వాత అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య సంబంధాల్లో కొంత తేడా వచ్చిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇక చెప్పను బ్రదర్ తర్వాత ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇతర హీరోల ఫ్యాన్స్, మరో హీరో ఫ్యాన్స్ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోకూడదనే మాట పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసినదే అనే వాదన వినిపిస్తున్నది.

English summary
Duvvada Jagannadham movie creating records collection wise. This DJ become highest collected movie in non Baahubali movie category. So now This movie crosses Chirajneevi's Khaidi No. 150 records.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X