For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జులాయి' భాక్సాఫీస్ ఫైనల్ రిజల్ట్

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయి రెండు వారాల క్రితం విడుదలైంది. రిలీజ్ రోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దానికితోడు విడుదల మరుసటిరోజే సక్సెస్ మీట్ పెట్టి సూపర్ హిట్ అని పబ్లిసిటి ప్రారంభించారు. తమ చేతిలోని మీడియా వర్గాల ద్వారా కూడా హిట్ టాక్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. అయితే మొదటి వారం అనుకున్నంతగా కలెక్షన్స్ లో ఆ ఊపు కనపడలేదు. అయితే దేముడు చేసిన మనుష్యులు చిత్రం డిజాస్టర్ కావటం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

  మరో ప్రక్క రాజమౌళి నిర్మాతగా షేర్ తీసుకుని పబ్లిసిటీ చేసిన అందాల రాక్షసి చిత్రం కూడా అనుకున్నంతగా క్లిక్ కాలేకపోయింది. టేకింగ్ బావుందని అంటున్నా సినిమా బాగా బోర్ గా ఉందని టాక్ రావటం సినిమాకు బాగా మైనస్ గా మారింది. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ ఆ చిత్రం బాగానే లాగినా జులాయికి ఏ విధంగానూ పోటీ ఇవ్వలేపోయింది. మరో ప్రక్క త్రివిక్రమ్ మ్యాజిక్ సినిమాలో లేదంటున్నా జనం గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ఒక సారి చూసి వద్దామనే ఫిక్స్ అవుతున్నారు. రాజేంద్రప్రసాద్,త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా సినిమాకు కలెక్షన్స్ పరంగా బాగానే కలిసి వచ్చిందనే చెప్పాలి.

  దానికి తోడు నిర్మాతలు ఛానెల్స్ లో ప్రచారం వ్యూహాత్మకంగా చేస్తున్నారు. బన్నీ సైతం ఎన్నడూ లేని విధంగా టీవీ ఛానెల్స్ కు ఇంటర్వూలు ఇస్తూ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీడియా ముందుకు రావటం పెద్దగా ఇష్టపడని త్రివిక్రమ్ సైతం ఎడాపెడా ఇంటర్వూలు ఇస్తూ ఎలాగైనా ఈ చిత్రాన్ని హిట్ ఖాతాలో పడేయాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. అయితే ఎన్నిచేసినా త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్ కు రావాల్సిన క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి.

  ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ నిరాసపరిచందని అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే పరవాలేదనిపించే సినిమా ఇది. త్రివిక్రమ్‌ మాటల గారడీతో ద్వితీయార్థాన్ని పక్కదోవ పట్టించాడనే విమర్శలూ ఉన్నాయి. ఆయన దర్శకుడిగా కంటే రచయితగానే డామినేట్‌ చేయాలని ప్రయత్నించడమే దీనికి కారణం. ఇక ఇలియానా అందాలు యువతను ఆకట్టుకున్నాయి. తన కెరీర్‌లోనే పాజిటివ్‌ టాక్‌ తెచ్చిన చిత్రమని అల్లు అర్జున్‌ చెప్పుకున్నప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం అలాంటి భావన లేదు. కేవలం ఏవరేజ్‌ సినిమాగానే మిగిలిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఫైనల్ గా ఒకసారి చూసెయ్యచ్చని అభిమానలు, వీకెండ్ లలో ఓకే అనిపించుకునే సినిమా అని ఫ్యామిలీలు అనుకుని ఈ సినిమాను మరో పెద్ద సినిమా వచ్చి పోటి ఇచ్చేదాకా లాక్కు వెళ్ళతారని లెక్కలు వేస్తున్నారు.

  English summary
  Allu Arjun's Julayi finally get average talk at Box Office. Weekend House Full will help this film to get minimum revenues. Puri's Devudu chesina Manushulu flop also help this film to rise collections.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X