twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవంబర్ 8: 5 తెలుగు సినిమాలు...రిలీజ్!

    By Srikanya
    |

    హైదరాబాద్ : వరస సమ్మెలు...తుఫానులు ప్రభావంతో చాలా తెలుగు సినిమాలు ఆగిపోయాయి. బాగా చిన్న సినిమాలకు ఆ సీజన్ కలిసివస్తే... కొంతకాలం తర్వాత అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, భాయ్ పెద్ద సినిమాలు ధైర్యం చేసి వచ్చేసాయి.అయితే మిడిల్ బడ్జెట్ తో తయారైన సినిమాలు మాత్రం విడుదల కాలేదు. అవన్ని ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

    మొదట నవంబర్ 8న మసాలా రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సినిమా నవంబర్ 14కి వెళ్లింది. దాంతో ..ఖాళీ గా ఉన్న ఆ వీక్ ని సద్వినియోగం చేసుకోవటానికి ఈ సినిమాలు భాక్సాఫీస్ వద్ద తామేంటో ప్రూవ్ చేసుకోవటానికి సిద్దమవుతున్నాయి.

    గతంలో నాలుగైదు సార్లు విడుదల తేదీలు ప్రకటించి వాయిదా పడ్డ ఈ సినిమాలు అన్ని ఒకేసారి..ఒకదానికొకటి పోటీ పడుతూ వచ్చేస్తున్నాయి. ఏ సినిమాకు సత్తా ఉంటే ఆ సినిమా నిలబడి క్రిస్ మస్ దాకా ఆడుతుందని నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాన్నీ ఆడియో పంక్షన్ జరుపుకున్నప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. బిజినెస్ కూడా సరిగ్గా జరగని ఈ చిత్రాలకు పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. చూడాలి..ఏది విజయం సాధిస్తుందో అని ట్రేడ్ లో ఎదురుచూస్తున్నారు.

    ఆ సినిమాలేంటి..ఆ విశేషాలు..స్లైడ్ షోలో...

    చండి

    చండి

    ప్రియమణి మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి రెడీ అవుతుంది. చారులత క్షేత్రం వంటి సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన ప్రియమణి చండి అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. వి. సముద్ర డైరెక్షన్లో రానున్న ఈ సినిమా కథ వినగానే ప్రియమణి వెంటనే అంగీకరించింది అని దర్శకుడు చెప్పారు. పంచాక్షరి తరువాత వి. సముద్ర చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ సినిమా కోసం ప్రియమణి విలు విద్య, గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. ఒమిక్స్ బ్యానర్ పై శ్రీను బాబు నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఆర్ శంకర్, చిన్న సంగీతం అందిస్తున్నారు.

    ‘సత్య-2' (వస్తున్నాడు)

    ‘సత్య-2' (వస్తున్నాడు)

    శర్వానంద్, అనైక జంటగా ముమ్మత్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సుమంత్‌కుమార్‌రెడ్డి మెట్టు నిర్మించిన చిత్రం ‘సత్య-2' (వస్తున్నాడు). ఈ చిత్రం విడుదలని అక్టోబర్ 25న అనుకున్నారు కానీ...నిర్మాత అరుణ్ శర్మకు,దర్శకుడుకి మధ్య విభేధాలు తలఎత్తడంతో చిత్రాన్ని నవంబర్ 8 కి వాయిదా వేసారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ తో తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:సంజీవ్, దర్శన్, నితిన్‌రైక్వర్, కెమెరా:వికాస్ సరఫ్, ఎడిటింగ్:జరీన్ జోస్, నిర్మాత:సుమంత్‌కుమార్ రెడ్డి మెట్టు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రామ్‌గోపాల్ వర్మ.

    'నేనేం చిన్నపిల్లనా..?'

    'నేనేం చిన్నపిల్లనా..?'

    సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి. రామానాయుడు నిర్మించిన 'నేనేం చిన్నపిల్లనా..?' సినిమా నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 8న సినిమాను విడుదల చేస్తున్నట్లు రామానాయుడు చెప్పారు. రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా నటించిన ఈ చిత్రానికి పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. రామానాయుడు మాట్లాడుతూ "ఇది చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సునీల్‌కుమార్‌రెడ్డి చాలా బాగా తీశారు. శ్రీలేఖ సంగీతం ఇచ్చిన ఆరు పాటలూ బాగున్నాయని అంటున్నారు. రాహుల్, తన్వీ వ్యాస్ ఇద్దరూ పోటా పోటీగా నటించారు'' అని చెప్పారు.

    కాళి చరణ్

    కాళి చరణ్

    గీతా ఆర్ట్స్ వారు చాలా కాలం క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కోసం ఎదురుచూస్తున్న ‘కాళిచరణ్' ని తీసుకుని విడుదల చేస్తున్నారు. ఈనెల 8న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీప్రవీణ్‌ మాట్లాడుతూ ''1980లో రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నటుల వేషధారణ, పరిసరాల్ని సినిమాలో చూపిస్తున్నాం. ఇటీవల విడుదలైన గీతాలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. గీతాఆర్ట్స్‌ ద్వారా సినిమాని విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.

    ‘చిన్ని చిన్ని ఆశ'

    ‘చిన్ని చిన్ని ఆశ'

    సూపర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డా. కిరణ్ దర్శకత్వంలో శ్రీనివాస్ గరిమెళ్ల నిర్మించిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశ' . తులసి, రాజీవ్ సాలూరి, అజయ్, అపర్ణా నాయక్, సింగితం శ్రీనివాసరావు ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్న మూడు వివిధ వయసుల జంటలకు చెందిన ప్రేమకథ ఇదని, ఆ మూడు వయస్సుల్లో కలిగే ప్రేమ, భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపుతున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు కిరణ్ తెలిపారు.

    ధన్యా బాలకృష్ణన్, వాసు ఇంటూరి, జెమినీ సురేష్, కౌశల్, వెంకట ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్.ఎం., కథ:వి.ఎన్.సతీష్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా:దామూ నర్రావుల, నిర్మాత:శ్రీనివాస్ గరిమెళ్ల, దర్శకత్వం:డా.కిరణ్.

    English summary
    Makers of low budget movies have opted for 8th of November as their release date and as of now five movies are scheduled to release on the same day. All the five movies were supposed to release on an earlier date and were postponed due to various reasons. Chandi, Nenem Chinna Pillana, Kali Charan, Chinni Chinni Aasa and Satya 2 are the movies which will be releasing this Friday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X