చిన్న సినిమా.. భారీ హిట్.. వంద కోట్ల క్లబ్‌లో ఫక్రే రిటర్న్స్
బాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చిన ఫక్రే రిటర్స్న్ భారీ కలెక్షన్లను సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అభిప్రాయాన్ని తలకిందులు చేసింది.
బాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చిన ఫక్రే రిటర్స్న్ భారీ కలెక్షన్లను సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. అలీ ఫజల్, రిచా చద్దా, పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ లాంటి పేరులోనే నటులు నటించిన చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం సినీ విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

వంద కోట్ల క్లబ్‌లో
మూడువారాల క్రితం రిలీజైన ఫక్రే రిటర్న్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మృగ్‌దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ చిత్రాల వసూళ్లను మించి కలెక్షన్లను సాధించింది.

స్వదేశీ మార్కెట్‌లో
దేశీయ మార్కెట్‌లో రూ.93.02 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 90 కోట్లు సాధించింది. ఇంకా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపిసిస్తున్నది.

బాలీవుడ్‌కు షాకిచ్చి..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన దాఖలాలు కనిపించడం లేదు. జుడ్వా2, గోల్‌మాల్ అగైన్ చిత్రాల తర్వాత వందకోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఫక్రే రిటర్న్స్ చేరడం విశేషం.

ఢిల్లీ యువకుల కథ..
ఢిల్లీకి చెందిన యువకుల చుట్టూ తిరిగే చిత్ర కథనే ఫక్రే రిటర్న్స్. భయంకరమైన మాఫియా డాన్, ప్రజలను వాగ్దానాలతో మోసపుచ్చే రాజకీయ నాయకుడి చుట్టూ కథ తిరుగుతుంది. హాస్య ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది.


Click it and Unblock the Notifications











