twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గబ్బర్ సింగ్’ తడాకా... పది రోజుల్లో 50 కోట్లు

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపిస్తోంది. ఈచిత్రం తెలుగు సిని పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజులు పూర్తి చేసుకున్న చిత్రం రికార్డు స్థాయిలో 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ రేంజిలో బిజినెస్ సాగడం టాలీవుడ్ చరిత్రలో రికార్డు.

    తొలుత పరిమితమైన థియేటర్లలో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం....ప్రేక్షకుల రద్దీ విపరీతంగా ఉండటంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. హైదరాబాద్‌లో 58 థియేటర్లతో కలిసి నైజాం మొత్తం 176 థియేటర్లలో గబ్బర్ సింగ్ పదర్శితం అవుతోంది. ముంబైలో 22 థియేటర్లు, బెంగుళూరులో 25 థియేటర్లు, అదే విధంగా యూఎస్‌ఏలో సెంకడ్ వీక్ 186 షోలు ప్రదర్శిస్తున్నారు.


    తొలివారంలో గబ్బర్ సింగ్ చిత్రం 42.55 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో గడిచిన మూడు రోజుల్లో సినిమా రూ. 9.70 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 6.6 కోట్లు వసూలు చేయగా, ఏపి బయట 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.6 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం రూ. 75 కోట్ల వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఇంత పెద్దమొత్తంలో కలెక్షన్లు కురిపించలేదు. సెకండ్ వీక్‌లో సైతం ఈ రేంజిలో కలెక్షన్లు రావడంపై ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు.

    ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్

    English summary
    Pawan Kalyan’s latest movie Gabbar Singh, which opened to overwhelming response, has continued to roar at the Box Office in the second week too. The remake of Dabangg has crossed Rs 50 crore mark at the collection centres across the world in just ten days. It is a record business at the Tollywood Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X